Canada Elections Results: ఆధిక్యంలో దూసుకెళ్తున్న మార్క్ కార్నీ పార్టీ
- కెనడాలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు
- ఆధిక్యంలో దూసుకెళ్తున్న మార్క్ కార్నీ పార్టీ
- మరోసారి అధికారం దిశగా లిబరల్ పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా వాణిజ్య యుద్ధం, కెనడాను అమెరికాలో ఒక రాష్ట్రంగా విలీనం చేస్తామంటూ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో కెనడియన్లు అప్రమత్తం అయ్యారు. తదుపరి ప్రధానమంత్రి కోసం కెనడియన్లు సోమవారం ఓటేశారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో దూసుకెళ్తోంది. పలుచోట్ల లిబరల్స్, కన్జర్వేటివ్‌ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. నువ్వానేనా? అన్నట్టుగా పోటీపడుతున్నాయి. ప్రస్తుతం లిబరల్ పార్టీ 59 స్థానాల్లో విజయం సాధించింది. మరో 101 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. కెనడా పార్లమెంట్లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకకు 172 మంది సభ్యులు అవసరం.
ఇది కూడా చదవండి: PSR Anjaneyulu: సీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులుకు షాక్.. మరో కేసు నమోదు
Also Read
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
కెనడాలో 4 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. లిబరల్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, న్యూ డెమోక్రాట్స్), బ్లాక్ క్యూబెకోయిస్ ఉన్నాయి. ప్రస్తుతం లిబరల్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి 152 స్థానాలున్నాయి. ప్రతిపక్షంలో కన్జర్వేటివ్ పార్టీ ఉంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో లిబరల్ పార్టీ 189 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కన్జర్వేటివ్ పార్టీ సైతం గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించే ఛాన్సుంది.
ఇది కూడా చదవండి: Gorantla Madhav: నేడు జైలు నుంచి విడుదల కానున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..
జనవరి 6 ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మార్క్ కార్నీ ప్రధాని అయ్యారు. రెండుసార్లు సెంట్రల్ బ్యాంకులకు గవర్నర్‌గా మార్క్ కార్నీ పనిచేశారు. మార్చిలో కెనడా లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే ఆయన సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిచ్చారు. కెనడాలో ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రధాని మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!