Site icon NTV Telugu

Canada Elections Results: ఆధిక్యంలో దూసుకెళ్తున్న మార్క్‌ కార్నీ పార్టీ

Canadaresults

Canadaresults

అమెరికా వాణిజ్య యుద్ధం, కెనడాను అమెరికాలో ఒక రాష్ట్రంగా విలీనం చేస్తామంటూ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో కెనడియన్లు అప్రమత్తం అయ్యారు. తదుపరి ప్రధానమంత్రి కోసం కెనడియన్లు సోమవారం ఓటేశారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మార్క్‌ కార్నీ నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో దూసుకెళ్తోంది. పలుచోట్ల లిబరల్స్‌, కన్జర్వేటివ్‌ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. నువ్వానేనా? అన్నట్టుగా పోటీపడుతున్నాయి. ప్రస్తుతం లిబరల్ పార్టీ 59 స్థానాల్లో విజయం సాధించింది. మరో 101 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. కెనడా పార్లమెంట్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకకు 172 మంది సభ్యులు అవసరం.

ఇది కూడా చదవండి: PSR Anjaneyulu: సీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులుకు షాక్‌.. మరో కేసు నమోదు

కెనడాలో 4 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. లిబరల్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, న్యూ డెమోక్రాట్స్), బ్లాక్ క్యూబెకోయిస్ ఉన్నాయి. ప్రస్తుతం లిబరల్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి 152 స్థానాలున్నాయి. ప్రతిపక్షంలో కన్జర్వేటివ్ పార్టీ ఉంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో లిబరల్ పార్టీ 189 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కన్జర్వేటివ్ పార్టీ సైతం గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించే ఛాన్సుంది.

ఇది కూడా చదవండి: Gorantla Madhav: నేడు జైలు నుంచి విడుదల కానున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..

జనవరి 6 ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మార్క్ కార్నీ ప్రధాని అయ్యారు. రెండుసార్లు సెంట్రల్ బ్యాంకులకు గవర్నర్‌గా మార్క్ కార్నీ పనిచేశారు. మార్చిలో కెనడా లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే ఆయన సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిచ్చారు. కెనడాలో ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రధాని మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version