Surprise Gift: యువకుడి సాహసం.. గిఫ్ట్‌గా రూ.60 లక్షల విలువైన కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సందర్భాల్లో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే.. మానసిక సంతృప్తియే కాదు.. ఆ కుటుంబం నుంచి కృతజ్ఞతలు కూడా అందుకుంటాం.. మరికొన్ని సందర్భాల్లో ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు కూడా పొందే వీలు కూడా ఉంటుంది.. తాజాగా, ఓ యువకుడు ప్రాణాలకు తెగించి.. మరో వ్యక్తి ప్రాణం కాపాడాడు.. లక్షల విలువైన కారును బహుమతిగా అందుకుని ఔరా..! అనిపించాడు. చికాగోలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: CM KCR: ప్రగతి భవన్ లో కీలక సమావేశం.. రాష్ట్రపతి ఎన్నికపై చర్చ
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
చికాగోకు చెందిన 20 ఏళ్ల టోనీ పెర్రీ అనే యువకుడు తన రిస్క్ చేసి ఓ వ్యక్తిని కాపాడాడు. ఇద్దరి యువకుల మధ్య గొడవ జరగగా.. ఆ ఇద్దరు తన్నుకుంటూ ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్స్ పై పడిపోయారు. అయితే, దాడి చేసిన వ్యక్తి తప్పించుకోగా.. బాధితుడు మాత్రం ఎలక్ట్రిక్ ట్రాక్స్ మీద పడిపోవడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.. 600 వోల్ట్స్ పవర్‌తో అల్లాడిపోయాడు.. ఈ ఘటనతో ప్లాట్‌ఫామ్ మీద ఉన్నవాళ్లంతా భయంతో దూరంగా పరుగులు తీయగా.. టోనీ మాత్రం సాహసం చేసి రైల్వే పట్టాల మీదకు దూకాడు.. వద్దని కొందరు వారిస్తున్నా.. తన ప్రాణాలు లెక్కచేయకుండా మరో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు పూనుకున్నాడు.. జాగ్రత్తగా ఆ వ్యక్తి పక్కకు జరిపాడు.. ఇక, టోనీ చేసిన ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేశాయి.. నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.. అంతేకాదు.. స్థానికులు ఘనంగా సన్మానించారు. ఇదే సమయంలో.. ఊహించని గిఫ్ట్ అందుకున్నాడు టోనీ.. స్థానికంగా ఉండే ఓ బిజినెస్ మెన్.. ఆడి ఏ8 కారును టోనీకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీని ధర ఇండియన్ కరెన్సీలో రూ.60 లక్షలకు పైగానే ఉండడం విశేషం.
మీలాంటి వ్యక్తులు మాకు అవసరం.. మా ప్రశంసలను అక్షరాలా చూపించాలనుకుంటున్నాము. మాకు ప్రపంచంలో ఎక్కువ మంది టోనీలు కావాలి అంటూ ఈ సందర్భంగా ఆడి కారును గిఫ్ట్‌గా ఇచ్చిన ఐయామ్ టెల్లింగ్ డోంట్ షూట్ స్థాపకుడు ఎర్లీ వాకర్ తెలిపారు. ఇక, ఆనందాన్ని వ్యక్తం చేసిన టోనీ.. ఆ కారు తన ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని చెప్పాడు. బాధితుడిని కాపాడే సమయంలో కొద్దిగా షాక్ తగిలిందని.. అయినా లెక్కచేయకుండా కాపాడినట్టు వెల్లడించాడు.. మరోవైపు.. పార్క్ మనోర్ సౌత్ సైడ్ పరిసరాల్లోని తన ఇంటి నుండి సబర్బన్ ఓక్ లాన్‌లోని అమెజాన్ ఫ్రెష్‌తో తన ఉద్యోగానికి వెళ్లడానికి రెండు బస్సులు మరియు రైలును మారుతుంటాడు.. ఇప్పుడు కారులోనే ఉద్యోగానికి వెళ్లే అవకాశం దక్కింది. మొత్తంగా అతడి ధైర్యమే.. అతడికి విలువైన కారును బహుమతిగా అందించింది.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..