NTV Telugu Site icon

A story of survival: సముద్రంలో తప్పిపోయి నరకయాతన.. ప్రాణాలు కాపాడిన కెచప్, వెల్లుల్లి పొడి

A Story Of Survival

A Story Of Survival

Man survived on ketchup while lost at sea for 24 days: నిజంగా జీవించాలని రాసిపెట్టి ఉంటే ఎంతటి క్లిష్టపరిస్థితుల్లో అయినా సహాయం లభిస్తుంది. సరిగ్గా ఇలాంటిదే ఈ స్టోరి. సముద్రంలో తప్పిపోయిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఏకంగా 24 రోజుల పాటు సముద్రంలో ఎక్కడ ఉన్నాడో తెలియదు, మాట్లాడేందుకు ఎవరూ లేరు, సహాయం దొరుకుతుందో లేదో అనే పరిస్థితుల నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఎల్విన్ ఫ్రాంకోయిస్(47) అనే వ్యక్తి 24 రోజుల పాటు ఒంటరిగా సముద్రంలో గడిపి, చావు నుంచి మళ్లీ తిరిగి వచ్చాడు.

కరేబియన్ ద్వీపాల్లోని డొమినికా ద్వీపానికి చెందిన ఫ్రాంకోయిస్ కేవలం కెచప్, వెల్లుల్లి పొడిని తిని ప్రాణాలు నిలుపుకున్నాడు. వర్షపు నీటిలో వీటిని కలుపుకని తింటూ ప్రాణాలను కాపాడుకున్నాడు. పాడైపోయిన నౌకలో ఒక్కటే ఉంటూ, వర్షపు నీటిని తాగుతూ 24 రోజుల పాటు బతికాడు.

అతను ప్రాణాలతో బయటపడేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. పడవలోనే ఉంటూ రక్షించమని కోరతూ పడవపై ‘ హెల్ప్’ అనే పదాన్ని చెక్కాడు. చాలా వరకు సముద్రంలో నౌకలను చూసినప్పటికీ వాటిని ఆకర్షించేందుకు విఫలయత్నం చేశాడు ఫ్రాంకోయిస్. అయితే ఏ నౌక కూడా ఫ్రాంకోయిస్ ను గుర్తించలేకపోయింది. ఓ సారి సముద్రంలో వెళ్తున్న షిప్ అనను చూసేందుకు తను ఉంటున్న పడవకు నిప్పు కూడా పెట్టాడు. దీంతో పడవకు రంధ్రాలు పడి నీరు లోపలికి రావడం ప్రారంభించింది. చివరకు ఎలాగొలా పడవను తిరిగి బాగు చేసుకున్నాడు.

Read Also: Minister Errabelli : దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారు

చివరకు ఓ అద్దం ముక్క సహాయంతో ఆకాశంలో వెళ్తున్న విమానం దృష్టిని ఆకర్షించడంలో ఫ్రాంకోయిస్ సక్సెస్ అయ్యాడు. జనవరి 15న తన పడవపై ఎగురుతున్న విమానంపై రద్దం ద్వారా సూర్యకిరణాలు పరావర్తనం చెందేలా చేసి వారి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. దీంతో విమానం సిబ్బంది స్థానిక నౌకాదళానికి సమాచారం అందించడంతో ఫ్రాంకోయిస్ ను కాపాడారు. తప్పిపోయిన సమయంలో ఫ్రాంకోయిస్ ఫ్యూర్టో బొలివర్ కు వాయువ్యంగా 120 నాటికన్ మైళ్ల దూరంలో సముద్రంలో ఉన్నాడు.

ఫ్రాంకోయిస్ గతేడాది డిసెంబర్ లో సెయింట్ మార్టెన్ ద్వీపంలోని ఓ ఓడరేవులో పడవను రిపేర్ చేస్తున్న సమయంలో వాతావరణం మారడంతో సముద్రంలోకి కొట్టుకుపోయాడు. నావిగేషన్ పై ఎలాంటి నాలెడ్జ్ లేకపోవడంతో సముద్రంలో తప్పిపోయాడని అధికారులు వెల్లడించారు.

Show comments