AI face-swapping: ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రెండ్ నడుస్లోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తన జీవితాలను మరింత సులభతరంగా మార్చుకోవడానికి ఈ సాంకేతికత మరింతగా సాయపడుతోంది. వ్యాసాలు రాయడం, కవితలు రాయడం, కవిత్వం, సంగీతం కంపోజ్ చేయడం వంటి ఎన్నో పనులకి AI ఉపయోగపడుతుంది. వచ్చే కొన్నేళ్లలో కొన్ని లక్షల ఉద్యోగాలు AIతో భర్తీ అవుతాయనే భయం కూడా వెంటాడుతోంది.
Read Also: New Parliament: ఇది ప్రజాస్వామ్యానికి అవమానం.. విపక్షాల బహిష్కరణపై ఎన్డీయే ఆగ్రహం
ఇదిలా ఉంటే సాంకేతికతను మానవ సౌకర్యానికి ఉపయోగించాలి.. కానీ ఈ టెక్నాలజీతో మోసాలు కూడా జరగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇదే AI టెక్నాలజీని ఉపయోగించి ఒకరు రూ. 5 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. చైనాకు చెందిన ఓ వ్యక్తి డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి వ్యక్తిని రూ.5 కోట్లకు పైగా మోసం చేశాడు. ఉత్తర చైనాలో ఒక స్కామర్ అత్యంత అధునాతన ‘డీప్‌ఫేక్’ సాంకేతికతను ఉపయోగించాడు. ఒకరి ఫ్రెండ్ గా నటిస్తూ ఏకంగా 4.3 మిలియన్ యువాన్లు( రూ.5కోట్లు) తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు. మోసగాడు AI- పవర్డ్ ఫేస్-స్వాపింగ్ టెక్నాలజీని బాధితుడి స్నేహితుడిగా నటించాడు.
బాటౌ నగరంలోని పోలీసులు ప్రకారం..మోసగాడు వీడియో కాల్ లో ఉన్నప్పుడు బాధితుడి స్నేహితుడిగా నటించాడని చెప్పారు. బిడ్డింగ్ ప్రకట్రియలో తన స్నేహితుడికి డబ్బు చాలా అవసరం ఉందని నమ్మిన బాధితుడు మోసగాడు అడిగిన మొత్తాన్ని బదిలీ చేశాడు. అయితే చోరీకి గురైన డబ్బులో చాలా వరకు పోలీసులు రికవరీ చేశారు. మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. AIని ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో, ఒక యువతి గొంతును క్లోన్ చేయడానికి స్కామర్లు AIని ఉపయోగించారు. సదరు యువతి తల్లి నుంచి డబ్బు డిమాండ్ చేశారు.