మనం సాధారణంగా తుమ్ము వస్తే ఏం చేస్తాం.. పక్కన ఎవరు లేకపోతే.. గట్టిగా తుమ్ముతాం.. ఎవరైనా ఉంటే.. నోటికి ముక్కుకు చేయి అడ్డం పెట్టుకుని తుమ్ముతాం. ఏదీ ఏమయినప్పిటికి తుమ్ము వచ్చినప్పుడు మాత్రం అసలు ఆపుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి తుమ్ము వచ్చినపుడు తుమ్మకుండా ఆపుకోవండంతో.. ప్రస్తుతం అతడు చాలా డేంజర్ పోజిషన్ లో ఉన్నాడు.
Read Also: Uttar Pradesh:ప్రసవ వేదనతో భార్య మృతి.. కొన్ని గంటల్లోనే కుప్పకూలిన భర్త
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక్క తుమ్మును ఆపుకోవడం కూడా ప్రాణాంతకమని… ఎప్పుడు తుమ్ము ఆపే ప్రయత్నం చేయవద్దని నిపుణులు తెలిపారు. అయితే.. తుమ్మును ఆపుకోవటం వల్ల యూకేకి చెందిన 30 వ్యక్తి ప్రమాదంలో పడ్డాడు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అతను తుమ్మును ఆపుకోవడం వల్ల గొంతులో రంధ్రం పడింది. అతని ఊపిరితిత్తులు గాలితో నిండిపోయాయి.
Read Also:Drug Factory: ఇది చూసి.. బాలామృతం అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే షాకే…
యూకేకి చెందిన 30 ఏళ్ల ఓ వ్యక్తికి.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలెర్జీల కారణంగా తుమ్ములు మొదలయ్యాయి. అయితే అతడు అందరిలో ఉన్నాననే సిగ్గు, భయంతో.. అతడి ముక్కు, నోరు మూసుకున్నాడు. దీంతో తుమ్ము ఆగిపోయింది. వెంటనే అతని గొంతులో తీవ్రమైన నొప్పి మొదలైంది. లోపల ఏదో పగిలిపోయినట్లు అనిపించింది. అతని శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. అతని మెడ ఉబ్బింది. వెంటనే అతను ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ని సంప్రదించాడు. CT స్కాన్‌లో అతని శ్వాసనాళంలో రంధ్రం కనిపించింది. ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య గాలి పేరుకుపోయింది. ఇది ప్రాణాంతకం కావచ్చునని వైద్యులు వెల్లడించారు.
