Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్

  • ఫ్రాన్స్‌లో ఇటలీ ప్రధాని మెలోని పర్యటన
  • మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్
  • అసౌకర్యానికి గురైన మెలోని
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Macronmeloni Kiss

Macronmeloni Kiss

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫ్రాన్స్ పర్యటనకు వచ్చారు. అయితే మెలోనికి స్వాగతం పలికేందుకు నేరుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎదురొచ్చారు. మెలోని కారులోంచి దిగగానే.. మాక్రాన్ దగ్గరకు వెళ్లి కౌగిలించుకుని ఎడాపెడా ముద్దులు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఒకింత మెలోని అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది. అంతేకాకుండా లోపలికి తీసుకెళ్లే క్రమంలో మెలోని నడుంపై చేయి వేసేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో పరిస్థితిని గమనించి మెలోని షేక్‌ హ్యాండిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో పాటు హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఐరోపా దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇక యుద్ధంలో సహకరించలేదని ట్రంప్ ఐరోపా దేశాలపై విరుచుకుపడుతున్నారు. ఐరోపా దేశాలు పిరికి దేశాలంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఐరోపా దేశాలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. దాదాపు 40 దేశాలతో చర్చించనున్నారు. ఈ క్రమంలో ఇటలీ ప్రధాని మెలోని ఫ్రాన్స్‌కు వచ్చారు. అయితే ఆమెకు స్వాగతం పలికే క్రమంలో మాక్రాన్ మరింత హద్దులు దాటి ఎడాపెడా ముద్దులు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో మెలోని అసౌకర్యానికి గురయ్యారు.

అయితే ఈ వీడియోపై ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలైన కామెంట్లు వస్తున్నాయి. మాక్రాన్ తన భార్యను మరిచిపోయినట్లుగా కనిపిస్తోందని.. విమానంలో మాక్రాన్‌పై భార్య దాడి విషయాన్ని గుర్తుచేశాడు. ఇదొక కొత్త రకమైన దౌత్యం అంటూ మరొకరు రాసుకొచ్చారు. ఐరోపా దేశాల్లో సర్వసాధారణంగా ఇలాంటి పలకరింపు కనిపిస్తోందని ఇంకొకరు పేర్కొన్నారు.