US-India trade talks: ఈయూ-భారత్ మధ్య ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందం దాదాపుగా ఖరారైంది. మరోవైపు, యూఎస్-ఇండియా ఒప్పందం మాత్రంపై రెండు దేశాలు సైలెంట్‌గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ సెనెటర్ టెడ్ క్రూజ్‌కు సంబంధించిన లీకైన ఆడియో అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఆడియోలో భారత్-అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం ముందుకు సాగకుండా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, వైట్‌హౌజ్ ఆర్థిక సలహాదారు పీటర్ నవారోలు అడ్డుపడినట్లు ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.
Read Also: WhatsApp యూజర్లకు షాక్.. డబ్బులు కడితేనే వాట్సాప్ సేవలు..!
ఈ ఆడియో 2025 ప్రారంభ, మధ్యకాలానికి సంబంధించిందిగా చెబుతున్నారు. దాదాపు 10 నిమిషాల రికార్డింగ్‌ను రిపబ్లికన్ సోర్సెస్ షేర్ చేసినట్లు ఆక్సియోస్ నివేదించింది. ప్రైవేట్ దాతలతో సంబాషణలో రికార్డయినట్లు చెప్పింది. ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తాయని క్రూజ్ హెచ్చరించారు. టారిఫ్‌ల కారణంగా రిటైర్మెంట్ ఖాతాల విలువ 30 శాతం పడిపోవచ్చని, కిరాణా ధరలు 10-20 శాతం పెరగొచ్చని, ఇదే జరిగితే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవచ్చని ట్రంప్‌ను హెచ్చరించారు.
భారత్‌తో వాణిజ్య ఒప్పందం కోసం తాను పోరాడుతున్నానని చెప్పిన క్రూజ్, ఈ డీల్‌కు ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, వైట్ హౌజ్ ఆర్థిక సలహాదారు పీటర్ నవారో, కొన్నిసార్లు అధ్యక్షుడు ట్రంప్ కూడా అడ్డుపడుతున్నాని పేర్కొన్నారు. కన్జర్వేటివ్ వ్యాఖ్యాత టక్కర్ కార్ల్సన్ ఆలోచనాధోరణి జేడీ వాన్స్‌ను ప్రభావితం చేస్తుందని క్రూజ్ ఆరోపించారు.
