Site icon NTV Telugu

Titanic Submersible: మునిగిపోయిన “టైటాన్” చివరి శిథిలం వెలికితీత..

Titan

Titan

Titanic Submersible: అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్‌ను చూసేందుకు ఐదుగురితో సముద్రంలోకి వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ విషాదకరంగా పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ టైటాన్ చివరి భాగాలను యూఎస్ కోస్ట్ గార్డు వెలికితీసింది. టైటాన్‌కి సంబంధించి గతంలో కొన్ని భాగాలను ఉపరితలంపైకి తీసుకువచ్చారు. మిగిలిన అవశేషాలను సముద్రం అడుగు భాగాల నుంచి సేకరించినట్లు యూఎస్ కోస్ట్ గార్డు మంగళవారం తెలిపారు. వైద్య అధికారులు మానవ అవశేషాలను విశ్లేషిస్తున్నారు.

Read Also: Sree Leela: మోక్షజ్ఞతో శ్రీ లీల పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్

మునిగిపోయిన నౌక టైటానిక్ శిథిలాలను చూపించేందుకు ఓషన్ గేట్ అనే సంస్థ టైటాన్ అనే సబ్ మెర్సిబుల్‌ని రూపొందించింది. ఈ ప్రమాదానికి ముందు పలుమార్లు టైటాన్ విజయవంతంగా టైటానిక్ వద్దకు వెళ్లి వచ్చింది. అయితే ఈ ఏడాది ఇలాగే మరోసారి టైటాన్ సబ్‌మెర్సిబుల్ టైటానిక్ వద్దకు ప్రయాణమైంది. దీనిలో బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ప్రెంచ్ నేవీ డైవర్ పాల్ హెన్రీ నార్గోలెట్, ఓషన్ గేట్ కంపెనీ చీఫ్ స్టాక్ టన్ రష్ మొత్తం ఐదుగురు టైటాన్ లో ప్రయాణించి మృత్యువాతపడ్డారు.

సముద్రం అడుగుభాగంలోకి వెళ్లే కొద్ది నీటి ఒత్తిడి టైటాన్‌పై చాలా ఉంటుంది. అయితే అందుకు తగ్గట్లుగానే దీన్ని నిర్మించారు. ఇదే టైటాన్ పేలిపోయేందుకు కారణమైంది. ఒత్తిడి ఎక్కువ కావడంతో ఇన్‌ప్లోజన్ అనే పేలుడు వల్ల టైటాన్ పేలిపోయింది. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఇది జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వారికి ఏం జరుగుతోందో తెలియకుండానే మరణించారు.

Exit mobile version