Site icon NTV Telugu

మూడో డోసుతో నాలుగు నెల‌ల పాటు ర‌క్ష‌ణ‌…!!

క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుక‌ట్ట వేసేందుకు వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే ప్ర‌స్తుతానికి ఉన్న ర‌క్ష‌ణ కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్య‌లో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో బూస్ట‌ర్ డోసులు అందించాల‌ని నిర్ణ‌యించారు. చాలా దేశాల్లో 18 ఏళ్లు నిండిన వారికి బూస్ట‌ర్ డోసుల అందిస్తున్నారు. బూస్ట‌ర్ డోసులు తీసుకున్న‌వారిలో యాంటిబాడీలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు టెక్సాస్ యూనివ‌ర్శిటి వైద్య విభాగం కీల‌క ప‌రిశోధ‌న చేసింది. ఫైజ‌ర్ టీకాను తీసుకున్న‌వారి ర‌క్త‌న‌మూనాల‌ను ప‌రిశీలించిన టెక్సాస్ యూనివ‌ర్శిటి వైద్య‌విభాగం కీల‌క విష‌యాల‌ను పేర్కొన్న‌ది. మూడో డోసు టీకాలు తీసుకున్న‌వారిలో నాలుగునెల‌ల‌పాటు యాంటీబాడీలు స్థిరంగా ఉంటాయని, ఒమిక్రాన్ వేరియంట్‌ను కూడా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటుంద‌ని నిపుణులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతానికి నాలుగో డోస్ అవ‌స‌రం లేద‌ని నిపుణులు చెబుతున్నారు.

Read: భారీగా త‌గ్గిపోతున్న కేసులు…. త్వ‌ర‌లోనే అక్క‌డ ఆంక్ష‌లు ఎత్తివేత‌…

Exit mobile version