NTV Telugu Site icon

కువైట్ కొత్త ఆంక్షలు: టీకా తీసుకోని పౌరులపై… 

ప్రపంచంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.  ప్రపంచ దేశాలు మహమ్మారి భయం నుంచి ఇంకా కోలుకోలేదు.  గల్ఫ్ దేశాల్లో కరోనా మహమ్మారి మళ్ళీ క్రమంగా విజృంభిస్తోంది.  దీంతో అక్కడ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.  గల్ఫ్  ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించారు.  ఇండియా విమానాలపై రెండు వారాలు బ్యాన్ విధించింది.  ఇక దేశీయ పౌరులపై కూడా ఆ దేశంలో కఠిన ఆంక్షలు విధించింది.  దేశీయంగా టీకాలు వేయించుకొని పౌరులపై ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం.  టీకాలు వేసుకోని పౌరులకు విదేశాలకు వెళ్లే అవకాశం ఇవ్వబోమని, తప్పకుండా ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని స్పష్టం చేసింది.  మే 22 నుంచి ఈ కొత్త ఆంక్షలు అమలులోకి రాబోతున్నాయి.