NTV Telugu Site icon

Nepal PM: నేడు నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ప్రమాణస్వీకారం..

Kp Sharma

Kp Sharma

Nepal PM: నేపాల్ మాజీ ప్రధాన మంత్రిగా కేపీ శర్మ ఓలి మరోసారి గద్దెనెక్కనున్నారు. ప్రస్తుత ప్రధాని పుష్పా కమల్ దహల్ విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో నేపాల్ ప్రధాని పీఠం కేపీ శర్మ ఓలికి దక్కింది. ఓలిని ప్రధానిగా కూటమి నేతలు అంగీకరించారు. దీంతో ఓలిని కొత్త ప్రధానిగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఎంపిక చేశారు. ఇవాళ ( సోమవారం) ప్రధానిగా కేపీ శర్మ ఓలి మరో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, నేపాల్ లో సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉంది.. ఒప్పందం ప్రకారం ప్రధానిగా ఉన్న ప్రచండ అధికార బదలాయింపుకు ఒప్పుకోకపోవడంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్- యూనిఫైడ్ మార్క్సిన్స్ లెనినిస్ట్ తమ మద్దతును వెనక్కి తీసుకుంది. దీంతో ప్రచండ విశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రచండకు మద్దతుగా కేవలం 63 మంది మాత్రమే ఓట్లు వేయడంతో ఆయన ఓడిపోయారు.

Read Also: Fourth White Paper: నేడు మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..

కాగా, నేపాల్ లో కొత్త ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్.. నేపాల్ కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. సభలో అతి పెద్ద పార్టీగా ఉన్న నేపాల్ కాంగ్రెస్ తో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సీపీఎన్- యూఎంఎల్ పార్టీ వారం క్రితం సర్కార్ ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రచండకు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు. ఈ ఒప్పందం తర్వాత నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్‌బా, ఓలిని తదుపరి ప్రధాన మంత్రిగా ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు. వీరి మధ్య ఒప్పందం ప్రకారం 18 నెలలు ఓలి.. ఆ తర్వాత మిగిలిన కాలం దేవ్‌బా ప్రధాని పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా 275 మంది సభ్యులున్న నేపాలీ పార్లమెంట్ లో నేపాలీ కాంగ్రెస్ కు 89 సీట్లు ఉండగా.. సీపీఎస్-యూఎంఎల్ కి 78 సీట్ల సంఖ్య బలం ఉంది. ఇరు పార్టీలు కలవడంతో ఆ సంఖ్య మెజారిటీకి అవసరమైన (138) సీట్లు కంటే ఎక్కువగా ఉంది.