Nepal PM: నేడు నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ప్రమాణస్వీకారం..
- మరోసారి నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి..
- నేడు నేపాల్ ప్రధాన మంత్రిగా కేపీ శర్మ ప్రమాణస్వీకారం..
- 18 నెలల పాటు ప్రధానిగా బాధ్యతల్లో కేపీ శర్మ ఓలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal PM: నేపాల్ మాజీ ప్రధాన మంత్రిగా కేపీ శర్మ ఓలి మరోసారి గద్దెనెక్కనున్నారు. ప్రస్తుత ప్రధాని పుష్పా కమల్ దహల్ విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో నేపాల్ ప్రధాని పీఠం కేపీ శర్మ ఓలికి దక్కింది. ఓలిని ప్రధానిగా కూటమి నేతలు అంగీకరించారు. దీంతో ఓలిని కొత్త ప్రధానిగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఎంపిక చేశారు. ఇవాళ ( సోమవారం) ప్రధానిగా కేపీ శర్మ ఓలి మరో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, నేపాల్ లో సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉంది.. ఒప్పందం ప్రకారం ప్రధానిగా ఉన్న ప్రచండ అధికార బదలాయింపుకు ఒప్పుకోకపోవడంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్- యూనిఫైడ్ మార్క్సిన్స్ లెనినిస్ట్ తమ మద్దతును వెనక్కి తీసుకుంది. దీంతో ప్రచండ విశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రచండకు మద్దతుగా కేవలం 63 మంది మాత్రమే ఓట్లు వేయడంతో ఆయన ఓడిపోయారు.
Read Also: Fourth White Paper: నేడు మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
కాగా, నేపాల్ లో కొత్త ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్.. నేపాల్ కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. సభలో అతి పెద్ద పార్టీగా ఉన్న నేపాల్ కాంగ్రెస్ తో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సీపీఎన్- యూఎంఎల్ పార్టీ వారం క్రితం సర్కార్ ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రచండకు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు. ఈ ఒప్పందం తర్వాత నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్‌బా, ఓలిని తదుపరి ప్రధాన మంత్రిగా ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు. వీరి మధ్య ఒప్పందం ప్రకారం 18 నెలలు ఓలి.. ఆ తర్వాత మిగిలిన కాలం దేవ్‌బా ప్రధాని పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా 275 మంది సభ్యులున్న నేపాలీ పార్లమెంట్ లో నేపాలీ కాంగ్రెస్ కు 89 సీట్లు ఉండగా.. సీపీఎస్-యూఎంఎల్ కి 78 సీట్ల సంఖ్య బలం ఉంది. ఇరు పార్టీలు కలవడంతో ఆ సంఖ్య మెజారిటీకి అవసరమైన (138) సీట్లు కంటే ఎక్కువగా ఉంది.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!