Site icon NTV Telugu

Iran: అమెరికా, ఇజ్రాయెల్ కుట్రతోనే సిరియా ప్రభుత్వం పతనం.. ఖమేనీ ఆరోపణ

Ayatollahalikhamenei

Ayatollahalikhamenei

సిరియా ప్రభుత్వం పతనంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ కుట్రతోనే సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయిందని ఖమేనీ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. తమ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా మద్దతు ఉన్న తిరుగుబాటుదారులే.. సిరియా ప్రభుత్వాన్ని కూల్చేశారని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి ప్రణాళికతోనే సిరియా ప్రభుత్వ పతనం అయిందని వివరించారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలకు సందేహాలు అక్కర్లేదన్నారు.

ఇది కూడా చదవండి: ICC Test Rankings: అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్న జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

సిరియాకు ఇరాన్, రష్యా, లెబనాన్ మద్దతు ఉంది. కానీ తిరుగుబాటు సమయంలో సిరియా అధ్యక్షుడు అసద్‌కు మాత్రం సపోర్టుగా నిలబడలేదు. పరిస్థితులు చేదాటిపోతున్నప్పుడు.. మిత్రదేశాలు హ్యాండిచ్చాయి. ఇక చేసేదేమీలేక.. అసద్.. సిరియాను వదిలి రష్యాకు పారిపోయారు. ప్రస్తుతం రష్యాలో అసద్ బస చేస్తున్నారు.

సిరియా నుంచి అసద్ పారిపోగానే.. ప్రజలు అధ్యక్ష భవనంలోకి చొరబడి వస్తువులను దోచుకున్నారు. ఇక బంకర్లలో వందలాది కార్లు ప్రత్యక్షమయ్యాయి. దొరికిన వస్తువులన్నీ ప్రజలు దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఆయుధాలు తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లకుండా.. రెబల్స్ లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తున్నాయి. ఆయా ఆయుధ కేంద్రాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Collectors Conference: 6 నెలల్లో ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు.. రెవెన్యూ విభాగంలోనే ఎక్కువ..

Exit mobile version