Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
- ఉపవాసంతో ఏసుక్రీస్తును కలుస్తారని ప్రచారం..
- కెన్యాలో 191 మంది హత్యల కేసులో దోషిగా తేలిని మత నాయకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
191 మంది హత్యలకు కారణమైన క్రైస్తవ మత నాయకుడు పాల్ మెకెంజీని కెన్యా కోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మరణాలపై కోర్టు తన తీర్పు వెలువరించింది. పిల్లలను ఆకలితో చంపాలని తన అనుచరుల్ని మెకెంజీ ఆదేశించాడు. మృతుల్లో ఒక్కరు మినహా మిగతా వాళ్లు అంతా చిన్నారులే. మెకెంజీతో పాటు అతడి మత సంస్థకు చెందిన మరో 28 మందిని దోషులుగా తేల్చింది. మొంబాసాలోని కోర్టులో జస్టిస్ డయానా మోచాచే సుమారు ఎనిమిది గంటలపాటు తీర్పును చదివి వినిపించారు. మెకెంజీ అనుచరులు అతడిని ఏసుక్రీస్తు సందేశాన్ని అందించే వ్యక్తిగా నమ్మారని న్యాయమూర్తి పేర్కొన్నారు. దోషిగా తేలిన మెకెంజీకి నవంబర్ 6న శిక్షను ఖరారు చేయనున్నారు.
ఆకలితో మాడ్చి చంపాడు..
మెకంజీ తన అనుచరుల పిల్లలను ఉపవాసంతో చనిపోయేలా చేయాలని ఆదేశించినట్లు కోర్టు ఆరోపించింది. ఇలా చేయడం ద్వారా వారు ఏసుక్రీస్తును కలుసుకుంటారని నమ్మించాడని విచారణలో తేలింది. విద్యను నిషేధించడంతో పాటు ఆధునిక వైద్యాన్ని చెడుగా చిత్రీకరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఉపవాసం చేయడానికి ఎవరైనా వ్యతిరేకించాన వారిని తన్నులు, దెబ్బలతో స్వర్గానికి పంపాలని మెకెంజీ చెప్పినట్లు సహ నిందితుల్లో ఒకరు వెల్లడించారు. చనిపోయిన వారిని అడవిలో పాతిపెట్టే కార్యక్రమాన్ని ‘వివాహాలు’గా పేర్కొనే వాడని, మరణించిన వారు ఏసుక్రీస్తును కలిశారని తన ఫాలోవర్లకు చెప్పే వాడని న్యాయమూర్తి తన తీర్పులో వివరించారు. చివరకు ఒక గర్బిణి తన బిడ్డకు పాలివ్వకుండా అడ్డుకున్నారని, 12 రోజలు తర్వాత శిశువు మరణించినట్లు తేలింది.
Also Read
- Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
- Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
- Kim Jong Un in Coma: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్..? ఉత్తర కొరియా నుంచి చైనాకు తరలింపు...!
- Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
400లకు పైగా మృతదేహాలు..
2023లో కెన్యా తీర ప్రాంతానికి సమీపంలోని షకహోలా అడవిలో 400కు పైగా సమాధులు కనిపించడం సంచలనంగా మారింది. సమాధుల్లో చిన్నారుల అవశేషాలు లభించడం ప్రపంచ వార్తగా మారింది. కొన్ని సమాధుల్లో మూడు మృతదేహాలు కూడా లభించాయి. చిన్నారుల చేతులు, కాళ్లు కట్టేసి, బెడ్షీట్లలో చుట్టి ఉంచారు. శవాలు పూర్తిగా కుళ్లిపోవడంతో కొందరిని ఇప్పటికీ గుర్తించలేకపోయారు. మెకెంజీ 2003లో గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ మినస్ట్రీస్ అనే మత సంస్థను స్థాపించాడు. మెకెంజీపై ఉగ్రవాదం, తీవ్రవాద భావజాల వ్యాప్తి, పిల్లలకు విద్య నిరాకరించడం వంటి ఇతర కేసులు ఉన్నాయి.
తాజావార్తలు
-
Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
-
AK 47 Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ వచ్చేది అప్పుడే!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణలపై కూటమి సమన్వయ కమిటీల దృష్టి.. అసంతృప్తులకు బుజ్జగింపులు
-
Rahul Gandhi: ‘‘హాలిడే ట్రిప్‌కు రాహుల్ గాంధీ’’.. అబద్ధాలు చెప్పి అలసిపోయాడని బీజేపీ సెటైర్లు..
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!