NTV Telugu Site icon

Kamala Harris: కమలా హారిస్ ఫ్యూచర్ ఫ్లాన్ ఇదేనా? 2 ఏళ్ల తర్వాత ఏం చేయబోతున్నారంటే..!

Kamalaharris

Kamalaharris

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడిపోయారు. సోమవారం ఆమె పదవీ కాలం ముగియడంతో మాజీ అయిపోయారు. అయితే ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరైన తర్వాత.. ఆమె ప్రస్తుతం కార్చిచ్చు బాధితులకు సహాయ చేసేందుకు లాస్ ఏంజిల్స్‌కు వెళ్లారు. గత కొద్దిరోజులుగా కార్చిచ్చు కారణంగా లాస్ ఏంజిల్స్ తగలబడుతోంది. దీంతో చాలా మంది నిరాశ్రయులుగా మారారు.

కమలా హారిస్ ముందుగా లాస్ ఏంజెల్స్‌లో బాధితులను పరామర్శిస్తారు. అనంతరం ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. ఆహార పదార్థాలను అందజేయనున్నారు. అటు తర్వాత వాలంటీర్లు, అగ్నిమాపక సిబ్బందితో సమావేశం అవుతారు.

ఇది కూడా చదవండి: Venkatesh : 25ఏళ్ల నాటి సంక్రాంతి సీన్ రిపీట్.. ఈ సారి కూడా విక్టరీ ఆ హీరోదే

ఇక కమలా హారిస్ రెండేళ్లలో జరగబోయే కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. 2026లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. గవర్నర్ పదవికి పోటీ చేసే యోచనలో భాగంగానే కార్చిచ్చు బాధితులను పరామర్శించే ప్రోగ్రాం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె భర్త కూడా తిరిగి న్యాయవాది వృత్తిలోకి వెళ్లిపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: HYDRA PS: బుద్ధ భవన్ ప్రక్కన హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్