Site icon NTV Telugu

Joe Biden: కమలా హారిస్‌ తన పోరాటాన్ని కొనసాగించనుంది..

Baiden

Baiden

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ రియాక్ట్ అయ్యారు. హారిస్‌ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది.. అసాధారణ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థిగా వచ్చి చరిత్రాత్మకమైన ప్రచారానికి నాయకత్వం వహించారని పొగిడారు. హారిస్‌ చాలా ధైర్యంతో నిండిన ప్రజా సేవకురాలు.. అమెరికన్లందరికీ స్వేచ్ఛ, న్యాయం, మరిన్ని అవకాశాలు రావాలని బలంగా కోరుకుంటుంది.. 2020 ఎన్నికల్లో నేను అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడు హారిస్‌పై నమ్మకంతోనే ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేశాను అని వెల్లడించారు. అమెరికన్లందరికీ కమలా హరీస్ ఛాంపియన్‌గా నిలుస్తుందని జో బైడెన్ పేర్కొన్నారు.

Read Also: IT Raids: మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఐటీ దాడులు.. అర్ధరాత్రి వరకు సోదాలు..

రానున్న తరాలకు కమలా హరీస్ మార్గదర్శిగా నిలుస్తారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌నకు బైడెన్‌ ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. అధ్యక్షుడు బైడెన్‌ తన నిబద్ధతను తెలియజేశారని పేర్కొనింది.

Exit mobile version