NTV Telugu Site icon

Justin Trudeau: దీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని ట్రూడో

Canada Pm

Canada Pm

Justin Trudeau: కెనడాలో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రధాని జస్టిన్‌ ట్రూడో పాల్గొన్నారు. ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్యపై భారత్- కెనడా మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ ఈ ఆసక్తికర పరిణామం జరిగింది. హ్యాపీ దీపావళి.. ఈ వారం వారితో సంబరాలు జరుపుకున్నాను.. ప్రత్యేక క్షణాలు గడిపానని ఎక్స్ (ట్విట్టర్)లో ట్రూడో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా చేతికి కట్టుకున్న తాళ్లను వీడియోలో చూపించారు. గత కొన్ని నెలలుగా కెనడాలోని పలు దేవాలయాలను తాను సందర్శించా.. గత కొన్ని నెలల్లో నేను మూడు హిందూ ఆలయాలను సందర్శించినప్పుడు కట్టిన తాళ్లు ఇవి అని చెప్పుకొచ్చారు. ఇవి తెగిపోయే వరకు వాటిని నేను తొలగించనని కెనడా ప్రధాని వెల్లడించారు.

Read Also: Sand Mafia: ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కార్ సీరియస్

ఇక, దీపావళి సంబరాల దృశ్యాలను కూడా ఆ పోస్టులో పంచుకున్నాడు ట్రూడో. గతంలో ఆయన దీపావళి సందేశంలో ఇండో- కెనడా కమ్యూనిటీ లేకపోతే దేశంలో దీపావళి సాధ్యం కాదు అన్నారు. వీరు ఆర్టిస్టులుగా, వ్యాపారవేత్తలుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, లీడర్స్‌గా, సంస్కృతిపరంగా కెనడాలో బెస్ట్‌ అని చెప్పుకొచ్చారు. అయితే, మరోవైపు భారత్‌- కెనడా సంబంధాలు క్షిణించిన నేపథ్యంలో అక్కడి ప్రతిపక్షం కూడా తొలుత దీపావళి వేడుకలకు దూరంగా ఉంది. ది ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా కెనడా (ఓఎఫ్‌ఐసీ) పార్లమెంట్‌ హాల్‌లో తలపెట్టిన దీపావళి సెలబ్రేషన్స్ కి హాజరుకానని ప్రతిపక్ష నేత పియర్రె పొయిలీవ్రే తెలిపారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆయన కార్యాలయం రియాక్ట్ అయింది. దీంతో ఆయన కూడా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు.

Show comments