Jeddah Tower: మనం ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ ఏదంటే, టక్కున గుర్తుకు వచ్చేది దుబాయ్‌లోని ‘బుర్జ్ ఖలిఫా’. అయితే త్వరలో ఇది మారబోతోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద టవర్‌గా సౌదీ అరేబియాలోని ‘జెడ్డా టవర్’ నిలవబోతోంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలోని ఓబుర్ ఉత్తర భాగంలో జెడ్డా ఎకనామిక్ సిటీ (JEC)లో ఈ ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నారు. గతంలో దీన్ని కింగ్‌డమ్ టవర్‌గా పిలిచేవారు. దీనిని ప్రముఖ ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ రూపొందించారు. గతంలో బుర్జ్ ఖలిఫాను డిజైన్ చేసింది కూడా ఇతనే.
ప్రత్యేకతలు ఇవే:
జెడ్డా టవర్ ఎత్తు 1,000 మీటర్లు (3,280 అడుగులు) కంటే ఎక్కువగా ఉంటుంది. మొత్తం నిర్మాణ వైశాల్యం 530,000 చదరపు మీటర్లు ఉంది. 20 బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న జెడ్డా ఎకనామిక్ సిటీ అభివృద్ధి మొదటిదశలో ఈ టవర్ నిర్మితమవుతోంది.
ఈ టవర్‌లో 170 అంతస్తులు ఉంటాయి, వీటిలో 200 గదులు మరియు 121 లగ్జరీ సర్వీస్డ్ అపార్ట్‌మెంట్‌లు ఉంటాయి. జెడ్డా టవర్‌లో 318 హౌసింగ్ యూనిట్లు వివిధ రకాల సౌకర్యాలు, జిమ్‌లు, స్పాలు, కేఫ్‌లు మరియు రెస్టారెంట్లు మరియు రెండు స్కై లాబీలు కలిగి 61 అంతస్తులు ఉంటాయి. మొత్తం 59 ఎలివేటర్ సిస్టమ్స్ ఉన్నాయి. దీని నిర్మాణానికి సుమారుగా 1.2 బిలియన్లు వ్యయం అవుతోంది.
ఈ టవర్ నిర్మాణం ఏప్రిల్ 1, 2013లో ప్రారంభమైంది. ముందుగా 2018లో పూర్తవుతుందని అంచనా వేశారు. అయితే కోవిడ్ పరిణామాలు, రాజకీయ సమస్యల కారణంగా దీని నిర్మాణ పనులు వాయిదా పడుతూ వచ్చాయి. సెప్టెంబర్ 2023 మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందనే వివరాలపై స్పష్టత లేదు.
అంశాలు జెడ్డా టవర్ బుర్జ్ ఖలీఫా
ఎత్తు 1000 మీటర్లు , 828 మీటర్లు
నిర్మాణ తేదీ ఏప్రిల్1, 2013 , జనవరి 6, 2004
పూర్తి స్పష్టత లేదు , జనవరి 4, 2010
ఖర్చు 1.2 బిలియన్ డాలర్ , 1.5 బిలియన్ డాలర్
ఫ్లోర్స్ 170 , 163
లిఫ్ట్స్ 59 , 57
ఆర్కిటెక్ట్ ఆర్డియన్ స్మిత్ , ఆర్డియన్ స్మిత్