JD Vance: ఇస్లామాబాద్‌లో వింత మర్యాద.. చిన్నారితో జేడీ వాన్స్‌కు స్వాగతం
- ఇస్లామాబాద్‌లో వింత మర్యాద
- చిన్నారితో జేడీ వాన్స్‌కు స్వాగతం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌తో శాంతి చర్చల కోసం జేడీ వాన్స్ బృందం కొద్దిసేపటి క్రితమే ఇస్లామాబాద్ చేరుకుంది. నూర్‌ఖాన్ ఎయిర్‌పోర్టులో అమెరికా విమానం ల్యాండ్ అయింది. విమానంలోంచి జేడీ వాన్స్ కిందకు దిగగానే ఒక చిన్నారితో స్వాగతం పలికారు. జేడీ వాన్స్ కిందకు వంగి చిన్నారి దగ్గర నుంచి బొకే తీసుకున్నారు. పక్కనే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Also Read
- Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
- Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ఇక ఇరాన్ బృందం అర్ధరాత్రి నూర్‌ఖాన్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అప్పుడు అసిమ్ మునీర్, అధికారులు స్వాగతం పలికారు. కానీ జేడీ వాన్స్ విషయంలో మాత్రం ప్రత్యేకంగా చిన్నారిని ముందు పెట్టి స్వాగతం పలికించారు. ఇప్పటికే ఇరాన్ 168 మంది పాఠశాల చిన్నారుల మృతికి నిరసనగా ఖాళీ విమానాన్ని తీసుకొచ్చింది. విమాన సీట్లలో చిన్నారుల బ్యాగ్‌లు, ఫొటోలు, రక్తంతో తడిసిన దుస్తులు కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరాన్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘మినాబ్-168’ అంటూ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా జేడీ వాన్స్‌కు చిన్నారితో స్వాగతం పలికించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందో తెలియడం లేదు. వాస్తవంగా ఫ్రొటోకాల్ మర్యాద ప్రకారం ప్రభుత్వ పెద్దలు స్వాగతం పలకాల్సి ఉంటుంది. జేడీ వాన్స్ ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
ఇదిలా ఉంటే తొలుత రెండు దేశాల బృందాల మధ్య పరోక్ష చర్చలు జరగనున్నాయి. అనంతరం రాత్రికి ప్రత్యక్ష చర్చలు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇరు పక్షాలకు మధ్యవర్తిగా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. అయితే ఈ చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా అంతర్జాతీయ మీడియా ప్రధానంగా ఫోకస్ చేస్తోంది.
#WATCH | Pakistan: US Vice President JD Vance arrived in Islamabad for peace talks with Iran.
(Video Source: US Network Pool via Reuters; quality as incoming) pic.twitter.com/oHjsaiSigX
— ANI (@ANI) April 11, 2026
#WATCH | IMPROVED QUALITY | Pakistan: US Vice President JD Vance arrived in Islamabad for peace talks with Iran.
(Video Source: US Network Pool via Reuters) pic.twitter.com/VZXLCxs9ab
— ANI (@ANI) April 11, 2026
తాజావార్తలు
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
-
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
-
MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
-
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!