తెలుగులో మాట్లాడుతూ ఇండియన్ ఫుడ్ రివ్యూ చేసిన జపాన్ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. జపాన్‌కు చెందిన ఓ కుర్రాడు అక్కడి ఓ ఇండియన్ రెస్టారెంట్‌ను సందర్శించి, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ ఫుడ్ రివ్యూ ఇవ్వడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అతని ఉచ్చారణ, హావభావాలు, అలాగే తెలుగు భాషపై అతనికి ఉన్న పట్టుదల చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చిన సోషల్ మీడియా, భాషా–దేశ సరిహద్దులను చెరిపేసి ఇలాంటి ఆసక్తికరమైన, వినోదాత్మక కంటెంట్‌కు అద్భుతమైన వేదికగా మారింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు ఆనందంతో పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
భారీ జనాభా కలిగిన మన దేశంలోని వివిధ భాషల్లో కూడా విదేశీయులు వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో జపాన్ యువకుడు ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడుతూ జపాన్‌లోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో ఫుడ్ తింటూ రివ్యూ ఇవ్వడం వీడియోను మరింత ప్రత్యేకంగా నిలిపింది. ఈ వీడియో చూసినవారంతా భలే ఫన్నీగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
