జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే నెలలో జరగనున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మీడియా సమావేశంలో ఫుమియో కిషిడా ప్రకటించారు. కిషిడా నిర్ణయంతో ఆయన స్థానంలో పార్టీ అధ్యక్షుడి కోసం పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: UN: తెలుగు వ్యక్తి హరీశ్‌కు అరుదైన అవకాశం.. యూఎన్‌లో భారత రాయబారిగా నియామకం
రాజకీయ కుంభకోణాలు, తన మూడేళ్ల పదవీకాలంలో ప్రజల అసంతృప్తికి లొంగి వచ్చే నెలలో తాను పదవీవిరమణ చేస్తానని కిషిడా బుధవారం చెప్పారు. పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డిపి) నాయకుడిగా తిరిగి తనను ఎన్ను కోకూడదనే తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం లేకుండా రాజకీయాలు పనిచేయవు అని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. రాజకీయ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో తాను ప్రజల గురించి ఆలోచించి ఈ భారీ నిర్ణయం తీసుకున్నాని చెప్పారు. సెప్టెంబరులో అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. కిషిడా వైదొలగడంతో ఆయన స్థానంలో కొత్త నేత రానున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: ఖమ్మం విద్యార్థినికి అరుదైన అవకాశం.. ఎర్రకోట వేడుకలకు కేంద్రం ఆహ్వానం