Site icon NTV Telugu

Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదు.. సునామీ హెచ్చరిక జారీ

Earthquake

Earthquake

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. భూ ప్రకంపనల తీవ్రత కారణంగా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యో వరకు పెద్ద భవనాలు కంపించాయి. మూడు మీటర్ల (10 అడుగుల) ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) సునామీ హెచ్చరిక జారీ చేసింది. తొలి సునామీ అలలు వెంటనే ఉత్తర తీరాన్ని చేరుకోవచ్చని వాతావరణ సంస్థ తెలిపింది.

సునామీ అలలు పదేపదే తాకే అవకాశం ఉందని.. హెచ్చరికను ఉపసంహరించుకునే వరకు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. సంక్షోభ నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

Exit mobile version