Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
- భారతీయ అన్నదాతలకు జపాన్ షాక్
- సీజన్లో మామిడిపండ్లపై నిషేధం
- భారత్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మామిడిపండ్ల సీజన్లో భారతీయ అన్నదాతలకు జపాన్ షాకిచ్చింది. 20 ఏళ్ల మామిడిపండ్ల వాణిజ్యానికి బ్రేక్ వేసింది. తాజాగా భారత మామిడిపండ్ల దిగుమతులను జపాన్ నిలిపివేసింది. భారతదేశంలోని మామిడిపండ్ల శుద్ధి కేంద్రాల్లో లోపాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో 2026 సీజన్‌కు సంబంధించి తాజా మామిడి దిగుమతులపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్లుగా జపాన్ అధికారులు వెల్లడించారు. జపాన్ నిర్ణయంతో ఆల్ఫాన్సో, కేసర్, లాంగ్రా, బంగనపల్లి వంటి ప్రధాన ఎగుమతి రకాలన్నీ ప్రభావితం కానున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉండే కీలక ఎగుమతి సీజన్ మొత్తానికీ ఈ ఆంక్షలు వర్తించనున్నాయి.

Also Read
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
బయటపడ్డ లోపాలు
ప్రతి సంవత్సరం భారత మామిడి సీజన్ ప్రారంభానికి ముందు జపాన్ క్వారంటైన్ అధికారులు భారత్‌లోని ఆవిరి ఉష్ణ చికిత్స (VHT) కేంద్రాలను తనిఖీ చేస్తుంటారు. ఈ ప్రక్రియలో మామిడిపండ్లను వేడి, తేమ కలిగిన గాలిలో నిర్దిష్ట ఉష్ణోగ్రత దగ్గర ఉంచి ఫ్రూట్ ఫ్లైలు వంటి పురుగులను నిర్మూలిస్తారు. జపాన్‌కు ఎగుమతులకు ఇది తప్పనిసరి నిబంధన. అయితే ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని రెహ్మాన్పూర్లో ఉన్న VHT కేంద్రాన్ని జపాన్ అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఫ్యూమిగేషన్ విధానాలు, శుద్ధి చర్యల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అయితే ఏ అంశాల్లో లోపాలు ఉన్నాయన్న దానిపై జపాన్ లేదా భారత అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. మార్చి 31, 2026 తేదీతో యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ అధికారిక నోటీసు జారీ చేసింది. మార్చి 25 తర్వాత భారత్ జారీ చేసిన తనిఖీ సర్టిఫికెట్లతో వచ్చే మామిడి సరుకులను స్వీకరించబోమని స్పష్టం చేసింది.
20 ఏళ్ల తర్వాత షాక్
జపాన్ 1986లో భారత మామిడిపండ్లపై మొదటిసారి నిషేధం విధించింది. ఫ్రూట్ ఫ్లై సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2006 జూన్ 23న ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ తర్వాత భారత్ ప్రత్యేకంగా VHT కేంద్రాలను ఏర్పాటు చేసింది. తిరుపతిలో 2007లో తొలి ప్రభుత్వ VHT కేంద్రం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని గుర్తింపు పొందిన కేంద్రాల నుంచే జపాన్‌కు మామిడిపండ్ల ఎగుమతులు జరుగుతున్నాయి. జపాన్ అనుమతించిన భారత మామిడి రకాల్లో ఆల్ఫాన్సో, కేసర్, బంగనపల్లి, లాంగ్రా, చౌసా, మాలికా ఉన్నాయి. తాజా నిర్ణయంతో అన్నదాతలు భారీ నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
భారత్‌కు ఎంత నష్టం?
భారత్‌కు జపాన్ అతిపెద్ద మామిడి మార్కెట్ కాకపోయినా.. ప్రీమియం ధరలు లభించే ముఖ్యమైన మార్కెట్‌గా గుర్తింపు పొందింది. APEDA గణాంకాల ప్రకారం 2024-25లో భారత్ సుమారు 29,938 మెట్రిక్ టన్నుల తాజా మామిడిపండ్లను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. వీటి విలువ సుమారు 56.5 మిలియన్ డాలర్లు. జపాన్‌కు తాజా ప్రాసెస్డ్ మామిడి ఉత్పత్తుల ఎగుమతుల విలువ 2025-26లో 1.54 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన కేసర్ రకం మామిడిపండ్లకు అక్కడ మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది భారత మామిడి ఎగుమతిదారులకు పరిస్థితులు అనుకూలంగా లేవు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో తీవ్ర ఎండల కారణంగా ఆల్ఫాన్సో మామిడి దిగుబడులు భారీగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. దీంతో ఎగుమతిదారులు ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో జపాన్ నిషేధం మరింత దెబ్బ తగిలేటట్టుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ నిషేధాన్ని ఎప్పుడు ఎత్తివేస్తారన్న దానిపై స్పష్టత లేదు. భారత కేంద్రాలు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని జపాన్ అధికారులు సంతృప్తి చెందే వరకు దిగుమతుల నిలిపివేత కొనసాగుతుందని నోటీసులో పేర్కొన్నారు. ఈ సీజన్లోనే మళ్లీ ఎగుమతులు ప్రారంభమవుతాయా లేదా అన్నది ఇంకా అనిశ్చితంగానే ఉంది.
తాజావార్తలు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!