Site icon NTV Telugu

నాసా కీలక అడుగు…లక్ష్యాన్ని చేరుకున్న జేమ్స్ వెబ్…

గతేడాది డిసెంబ‌ర్ 25 వ తేదీన ఫ్రెంచ్ గ‌యానా అంత‌రిక్ష కేంద్రం నుంచి నాసా, యూర‌ప్, కెన‌డా దేశాలు సంయుక్తంగా త‌యారు చేసిన అతిపెద్ద టెలిస్కొప్ జేమ్స్ వెబ్‌ను ప్ర‌యోగించిన సంగ‌తి తెలిసిందే. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వివిధ క‌క్ష్యల‌ను దాటుకొని సుమారు 15 ల‌క్ష‌ల కిమీ దూరం ప్ర‌యాణించి రెండో లాంగ్రెంజ్ పాయింట్‌ను చేరుకుంది. అక్క‌డి నుంచి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వం నుంచి వివిధ స‌మాచారాన్ని సేక‌రించి భూమికి పంప‌నున్న‌ది.

Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

విశ్వం ఆవిర్భ‌వం గురించిన వివ‌రాలు తెలుసుకునేందుకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. సుమారు రూ. 73 వేల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో ఈ టెలిస్కోప్‌ను నిర్మించారు. 20 ఏళ్ల‌పాటు శాస్త్ర‌వేత్త‌లు క‌ష్ట‌ప‌డి ఈ టెలిస్కోప్‌ను త‌యారు చేయ‌గా, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప‌దేళ్ల‌పాటు రోద‌సిలో సేవ‌లు అందించ‌నున్న‌ట్టు నాసా తెలియ‌జేసింది.

Exit mobile version