Site icon NTV Telugu

ట్విట్టర్‌ సీఈవో పదవికి జాక్‌ డోర్సీ గుడ్‌బై

మైక్రో బ్లాగింగ్ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ ఇంక్ సీఈవో జాక్ డోర్సీ వైదొలిగారు. ఆయ‌న స్థానంలో నూత‌న సీఈవో ఎంపిక విష‌య‌మై జాక్ డోర్సీ, ట్విట్ట‌ర్ బోర్డు మ‌ధ్య ఏకాభిప్రాయం కుదిరిన‌ట్లు స‌మాచారం. జాక్ డోర్సీ వార‌సుడిగా కంపెనీ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ ప‌రాగ్ అగ‌ర్వాల్ నియ‌మితుల‌య్యారు. గ‌తేడాది నుంచే డోర్సీని సీఈవోగా సాగ‌నంపేందుకు ట్విట్టర్‌బోర్డు సిద్ధమైంది. ట్విట్టర్‌ సీఈవోగా జాక్ డోర్సీ వైదొల‌గ‌నున్నార‌న్న వార్తలపై స్పందించేందుకు సంస్థ అధికార ప్రతినిధులేవ్వరు అందుబాటులోకి రాలేదు.

డోర్సీ చివ‌రి ట్వీట్ ఇలా..
ట్విట్టర్‌ సీఈవోగా డోర్సీ వైదొలుగుతార‌న్న వార్తలనేపథ్యంలో సంస్థ స్క్రిప్ట్ ప్రారంభంలో 11 శాతం పెరిగింది. డోర్సీ సార‌ధ్యంలోని డిజిట‌ల్ పేమెంట్స్ సంస్థ స్క్వేర్ ఇంక్ మూడు శాతం పెరిగింది. ఆదివారం చివ‌రిగా జాక్ డోర్సీ చేసిన ట్విట్‌లో.. నేను ట్విట్టర్‌ను ప్రేమిస్తాను అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను సోమ‌వారం 54 వేల మందికి పైగా లైక్ చేశారు. జాక్ డోర్సీ వైదొల‌గ‌నున్నార‌న్న వార్తను ప్రముఖ ఛానల్‌ సీఎన్బీసీ రిపోర్ట్‌ చేసింది. .

గతేడాది నుంచే డోర్సీ వైదొలగాలని ఒత్తిడి
గ‌తేడాది ప్రారంభంలో ఎల్లియ‌ట్ మేనేజ్మెంట్ గ్రూప్ నుంచి జాక్ డోర్సీని తొల‌గించాల‌న్న డిమాండ్ బ‌లంగా వినిపించింది. ట్విట్టర్‌ను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని, ఎల్లియ‌ట్ మేనేజ్మెంట్ గ్రూప్ వాద‌న‌. పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీ స్క్వేర్ ఇంక్‌ను ట్విట్టర్‌ నిర్వహిస్తుందని ఆరోపించింది. ఆరోపించింది. ఆయ‌న రాజీనామా తక్షణమే అమ‌లులోకి వ‌స్తుంద‌ని, ఇక నుంచి డైరెక్టర్‌గా 2022 వ‌ర‌కు కొన‌సాగుతార‌ని ట్విట్టర్‌ వర్గాలు తెలిపాయి.

Exit mobile version