Site icon NTV Telugu

Hamas Attack On Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం.. 300కి పైగా మరణాలు..

Isreal

Isreal

Hamas Attack On Israel: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్లు ప్రయోగించారు. దాదాపుగా 14 ప్రాంతాల నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొచ్చుకువచ్చారు. పౌరులతో పాటు సైనికులను బందీలుగా తీసుకున్నారు. బందీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇజ్రాయిల్ మహిళా సైనికురాలిని చంపి నగ్నంగా ఊరేగించడం, సైనికుడిని కాల్చి చంపిన వీడియోలు బయటకు వచ్చాయి.

హమాస్ జరిపిన దాడిలో ఇజ్రాయిల్ కి చెందిన 100 మంది మరణించగా..700 పైగా మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ ప్రతీకారదాడులకు గాజా స్ట్రిప్ కాకవికలం అవుతోంది. హమాస్ మిలిటెంట్ట స్థాపరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల గాజాలో 198 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్యవిభాగం వెల్లడించింది. 1600కు పైగా గాయపడ్డారని తెలిపింది.

Read Also: World Cup 2023: శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం.. 102 పరుగుల తేడాతో గెలుపు

ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. తాము యుద్ధంలో ఉన్నామని, హమాస్ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్, యూకే పీఎం రిషి సునాక్, అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ ఇతర దేశాలు ఇజ్రాయిల్ కి అండగా నిలిచాయి. ఇరాన్ హమాస్ కి మద్దతుగా నిలిచింది.

ఈ దాడిని ఉద్దేశిస్తూ.. పాలస్తీనా గొప్ప విజయం అంచున ఉందని హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే శనివారం అన్నారు. ఇజ్రాయిల్ జైళ్లలో మగ్గుతున్న మన ఖైదీలను విముక్తి చేయడానికి పోరాటం పూర్తి కావాలి అని సందేశమిచ్చారు. హమాస్ ఈ దాడుల్ని గాజాలో ప్రారంభించి వెస్ట్ బ్యాంక్, జెరూసలేం వరకు విస్తరించవచ్చని హనీయే ప్రకటించారు.

Exit mobile version