Site icon NTV Telugu

Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 24 గంటల్లో 146 మంది మృతి

Gaza

Gaza

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 146 మంది పాలస్తీనియున్లు మృతిచెందారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ చెడింది. దీంతో ఇజ్రాయెల్ దూకుడుగా వెళ్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. తాజా దాడుల్లో 146 మంది చనిపోతే.. 459 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య అధికారులు శనివారం తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇది అత్యంత శక్తివంతమైన దాడిగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Ambati Rambabu: అరెస్ట్‌ల వెనుక రాజకీయ కుట్ర కోణం.. అక్రమ అరెస్టులకు అదరం, బెదరం..!

మే 5న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ మంత్రివర్గం.. గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకోవాలని.. సహాయాన్ని నియంత్రించాలని తీర్మానించినట్లు చెప్పారు. హమాస్‌పై తీవ్రమైన దాడిని ప్లాన్ చేస్తోందన్నారు. అన్నట్టుగానే తాజాగా భారీగా దాడులు చేపట్టింది.

ఇది కూడా చదవండి: MLA Sudheer Reddy: మా అందరికీ రథసారధి కేసీఆర్.. పార్టీలో ఎవరి మధ్య విభేదాలు లేవు..

అంతర్జాతీయ మధ్యవర్తుల సాయంతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. తొలి విడత ఒప్పందాన్నే కొనసాగించాలని ఇజ్రాయెల్ అడిగింది. కానీ అందుకు హమాస్ అంగీకరించలేదు. దీంతో హమాస్ నాశనమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దూకుడుగా వెళ్తోంది. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా గాజాను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.

Exit mobile version