Site icon NTV Telugu

ఆగని ఇజ్రాయిల్ దాడులు… నేలమట్టమైన మీడియా భవనం… 

ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాల మధ్య రగడ తారాస్థాయికి చేరింది.  గాజాపట్టిలోని హమాస్ ఉగ్రవాదులు వరస దాడులు చేస్తుండటంతో ఇజ్రాయిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  గాజాపట్టిపై బాంబుల వర్షం కురిపించింది.  ఒకవైపు రాకెట్ లాంఛర్లతో క్షిపణులను ప్రయోగిస్తూనే, మరోవైపు యుద్ధవిమానాలతో బాంబుల వర్షం కురిపించింది.  శనివారం రోజున పాలస్తీనాపై 160 ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.  దీంతో పలు భవనాలు ధ్వంసం కాగా, అనేక మంది పౌరులు మృతి చెందారు.  ఈ వైమానిక దాడిలో పాలస్తీనాలోని అసోసియేటెడ్ ప్రెస్, ఆల్ జజీరా, ఇతర మీడియా సంస్థలు ఉన్న 11 అంతస్తుల భవనం కూడా కుప్పకూలిపోయింది.  ఇజ్రాయిల్ వైమానిక దాడిపై అటు టర్కీ, లెబనాన్ ను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.   

Exit mobile version