Site icon NTV Telugu

Israel-Gaza: ఖైదీల వీడియో లీక్.. ఇజ్రాయెల్ టాప్ అడ్వకేట్ జనరల్ మేజర్ రాజీనామా

Israel

Israel

గాజా-ఇజ్రాయెల్ మధ్య రెండేళ్లు భీకర యుద్ధం జరిగింది. ఈ మధ్యే శాంతి ఒప్పందం జరగడంతో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే యుద్ధ సమయంలో పాలస్తీనా ఖైదీలతో జరిగిన సంభాషణకు చెందిన ఒక వీడియో లీక్ అయింది.

ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. అబ్బాయితో తిరగొద్దన్న పాపానికి తల్లిని చంపిన కుమార్తె

గాజా యుద్ధంలో అరెస్టయిన పాలస్తీనా ఖైదీపై ఇజ్రాయెల్ సైనికులు దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన వీడియో లీక్ అయింది. ఒక న్యూస్ ఛానల్‌లో ప్రసారం కావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. సైనికులు.. ఖైదీని పక్కకు తీసుకెళ్లి చుట్టూ గుమిగూడి దుర్భాషలాడారు. అయితే వీడియో లీక్‌పై విచారణ జరిగింది. దీని వెనుక ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ లీగల్ ఆఫీసర్ యిఫత్ టోమర్-యెరుషల్మి ఉన్నట్లు తేలింది. ఆగస్టు 2024లో వీడియో లీక్‌ చేయడానికి ఆమోదించినందున తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అడ్వకేట్ జనరల్ మేజర్ జనరల్ యిఫత్ టోమర్-యెరుషల్మి శుక్రవారం తెలిపారు. రాజీనామా లేఖలో ఖైదీలను ‘‘చెత్త రకమైన ఉగ్రవాదులు’’ అని సంబోధించారు.

ఇది కూడా చదవండి: Omar Abdullah vs Lt Governor: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ఎల్జీ-ముఖ్యమంత్రి మధ్య రగడ

వీడియో లీక్ వెనుక ఐదుగురు సైనికులపై క్రిమినల్ అభియోగాలు కూడా నమోదయ్యాయి. రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ.. వీడియో లీక్‌పై క్రిమినల్ విచారణ కొనసాగుతోందని.. టోమర్-యెరుషల్మి బలవంతంగా సెలవులో ఉన్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: with my old friend..! 393 అంబాసిడర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు..

Exit mobile version