Iran Israel War: కొత్త సుప్రీంలీడర్ ఎన్నిక వేళ, అదే భవనంపై ఇజ్రాయిల్ భారీ దాడి..

Iran War (1)

Iran War (1)

Iran Israel War: ఇజ్రాయిల్ ఇరాన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది. ఖమేనీతో పాటు చాలా మంది అగ్ర స్థాయి సైనిక, రాజకీయ నాయకులు మరణించారు. ఇదిలా ఉంటే, తాజాగా కొత్త సుప్రీం లీడర్ ఎన్నికపై ఇజ్రాయిల్ దృష్టి సారించింది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎన్నికయ్యే భవనాన్ని కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ నగరంలోని కోమ్‌లోని ‘‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’’ కార్యాలయాన్ని వైమానిక దాడిలో పేల్చేసింది. ఈ భవనంలోనే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నిక జరుగుతుంది. ఇజ్రాయిల్ దాడిలో భవనం పూర్తిగా ధ్వంసమైందని.

Read Also: Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

×
×
Ad

ఇరాన్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయిల్ మిలిటరీ ఐడీఎఫ్ సోషల్ మీడియాలో పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడి కార్యాలయంప, భదత్రా మండలి భవానాలను కూడా ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది. 83 సభ్యులు ఉన్న ‘‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్’’ సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అత్యున్నత మండలి. ఓటింగ్ సమయంలో సభ్యులందరూ అక్కడ లేరని, కొందరు మాత్రం దాడిలో చనిపోయినట్లు తెలుస్తోంది.