NTV Telugu Site icon

Israel-Labnon: బైకులు వెళ్లేంతగా హిజ్బుల్లా టన్నెల్‌.. ఇజ్రాయెల్ వీడియో విడుదల

Israelvideo

Israelvideo

గతేడాది అక్టోబర్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే హమాస్ లక్ష్యంగా గాజాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. తాజాగా హిజ్బుల్లా లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు వార్ కొనసాగిస్తున్నాయి. హమాస్ సొరంగాలు నాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం.. అంతకంటే పెద్దవైన హిజ్బుల్లా సొరంగాలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ దళాలు విడుదల చేశాయి.

ఇది కూడా చదవండి: AP Weather: రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం.. దక్షిణకోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన

తాజాగా హెజ్బుల్లా గ్రూప్‌ సభ్యులు ఉపయోగించిన ఓ రహస్య టన్నెల్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో.. హెజ్బుల్లా సొరంగానికి సంబంధించి ఇనుప తలుపులు, ఫంక్షన్‌ రూమ్‌లు, ఏకే 47 రైఫిళ్లు, బెడ్రూం, బాత్రూం, స్టోర్‌ రూం, జనరేటర్‌, వాటర్‌ ట్యాంక్‌, ద్విచక్ర వాహనాలు కనిపిస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌లో వంద మీటర్ల మేర ఉన్న ఈ సొరంగంలో ఉగ్రవాదుల సామగ్రి దృశ్యాలను ఇజ్రాయెల్‌ ఆర్మీ చూపించింది. హిజ్బుల్లా గ్రూప్‌ ఏం చేస్తోందో చూడడానికి మేము సరిహద్దును దాటి అక్కడి వెళ్తున్నామని ఓ ఇజ్రాయెల్ సైనికుడు మాట్లాడటం వీడియోలో కనిపించింది.