ఇరాన్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఒక్కొక్కరిగా నేలరాలిపోతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దగ్గర నుంచి ఆయన కుడి భుజం, ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ వరకు టాప్ మోస్ట్ లీడర్లంతా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో టాప్ లీడర్లందరినీ హతమార్చుతోంది. తాజాగా మరో కీలక నేతను అంతమొందించింది.
ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌పై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ నేవీ కమాండర్ అలిరెజా తంగ్సిరి ప్రాణాలు తీసింది. ప్రస్తుతం హార్ముజ్ దిగ్బంధనాన్ని అలిరెజా తంగ్సిరినే పర్యవేక్షిస్తున్నాడు. హార్ముజ్ జలసంధి మూసివేతకు అలీరెజానే కారణమని నివేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలిరెజాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుని చంపేసింది. అలిరెజా హతం అయినట్లుగా ఐడీఎఫ్ ఎక్స్‌లో వెల్లడించింది.
