Gaza War: ఇజ్రాయిల్, గాజా మధ్య యుద్ధం తీవ్రతరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర గాజాలో సైనిక చర్య చేపట్టడానికి ఇజ్రాయిల్ సైన్యం సిద్ధమైంది. మంగళవారం ఉదయం ఇజ్రాయిల్ ఆర్మీ, గాజా నగరాన్ని ఖాళీ చేయాలని ప్రజలను కోరింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. హమాస్ ఉపయోగించే కనీసం 50 టెర్రర్ టవర్లను ధ్వంసం చేయాలని ఇజ్రాయిల్ యోచిస్తున్నట్లు చెప్పారు. పాలస్తీనియన్లు గాజా నగరం నుంచి పారిపోయవాలని హెచ్చరికలు జారీ చేసింది.
Read Also: Nepal Protest: నేపాల్ మాజీ ప్రధానిని రక్తం వచ్చేలా కొట్టిన ప్రజలు..
గాజా నగరంలోని కొన్ని ప్రాంతాల నుంచి దక్షిణ భాగాన ఏర్పాటు చేసిన మానతవతా కారిడార్‌కు పారిపోవానలి కోరింది. గాజా నగరంపై ల్యాండ్ అటాక్స్‌కు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్లాన్ చేసింది. అయితే, గాజా నగరంలోని 10 లక్షల మంది పాలస్తీనియన్లలో కొంతమంది మాత్రమే ఈ హెచ్చరికకు ముందు నగరాన్ని వదిలి వెళ్లారు.
ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ..‘‘గాజా నగరంపై శక్తివంతమైన హరికేన్’’ దూసుకువస్తుందని సోమవారం హెచ్చరించారు. హమాస్ తమ వద్ద ఉన్న ఇజ్రాయిల్ బందీలను వదిలేయాలని, ఆయుధాలను వదిలివేయాలని చివరిసారిగా హెచ్చరించారు. గాజాలో హమాస్ ఉగ్రవాదుల్ని ఓడించేందుకు ఐడీఎఫ్ సన్నాహాలు చేస్తున్నట్లు కాట్జ్ చెప్పారు. గాజా, విదేశాల్లో లగ్జరీ హోటళ్లలో నివసిస్తున్న హమాస్ హంతకులు, రేపిస్టులకు ఇది చివరి హెచ్చరిక అంటూ హెచ్చరించారు.
