Site icon NTV Telugu

Iran: భర్తను చంపిందని, “చిన్నారి పెళ్లికూతురి”కి ఉరిశిక్ష అమలు..

Iran...

Iran...

Iran: ఇస్లామిక్ రాజ్యం ఇరాన్‌లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలుసు. అక్కడ కంటికి కన్ను అనే రీతిలో శిక్షలు ఉంటాయి. షరియా చట్టాన్ని పాటించే ఇరాన్‌లో ఏ దేశంలో లేనట్టుగా ఉరిశిక్షలను విధిస్తోంది. మైనర్లు, మేజర్లు అనే తేడా లేకుండా తప్పు ఎవరు చూసినా.. ఉరిశిక్షే గతి. ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో మరణశిక్షలను అమలు చేస్తోంది. తాజాగా ఓ మహిళకి ఉరిశిక్షను అమలు చేసింది. చిన్నతనంలోనే వివాహం చేసుకున్న బాలిక తన భర్యను హత్య చేసిన ఆరోపణల్లో దోషిగా తేలింది. దీంతో ఆమెను బుధవారం ఉరితీసినట్లు నార్వేకి చెందిన ఇరాన్ మానవహక్కులు సంస్థ వెల్లడించింది.

Read Also: New Criminal Bills: మూడు న్యాయ సంహిత బిల్లులకు లోక్‌సభ ఆమోదం

గత దశాబ్ధకాలంగా సమీరా సబ్జియాన్ అనే మహిళ టెహ్రాన్ లోని శాటిలైట్ సిటీ కారాజ్‌లోని ఘేజెల్ హెసర్ జైలులో తెల్లవారుజామున శిక్షను అమలు చేశారు. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే పెళ్లై, గృహహింసను ఎదుర్కొంది. 10 ఏళ్ల క్రితం, 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన భర్తను హత్య చేసిన ఆరోపణలపై అరెస్ట్ చేసి, మరణశిక్ష విధించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఒక్క నవంబర్ నెలలోనే 115 మందికి ఇరాన్ మరణశిక్షను విధించింది. ఈ ఏడాది ఉరిశిక్షలు పెరగడంపై అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది మహ్సా అమిని హత్య తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఉద్యమంలో పలువరు ఇరాన్ భద్రతా సిబ్బంది హతమయ్యారు. ఈ కేసుల్లో చాలా మంది మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురిని అక్కడి అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం ఉరితీసింది. ఈ ఏడాది ఇరాన్ 18 మంది మహిళలకి ఉరిశిక్ష విధించింది.

Exit mobile version