ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. గగనతలంలోనే క్షిపణులను ఇజ్రాయెల్ పేల్చేసింది. కొన్ని మాత్రం టెల్‌అవీవ్, జెరూసలేం సమీపంలో పడ్డాయి. అయితే ప్రాణనష్టం జరగలేదు. అయితే అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతుంది. అవకాశం ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Big Breaking: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 30 మంది మావోయిస్టుల హతం..
ఇదిలా ఉంటే గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇరాన్ చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో కూడా ఇవే కథనాలు వెలువడుతున్నాయి. హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ముఖ్యమైన నాయకులను లేపేసింది. హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది.
ఇది కూడా చదవండి: Devara 2: ‘దేవర 2’ అప్పుడేనా?
ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయుతుల్లా అలీ ఖమేనీ ఐదేళ్ల తర్వాత తొలిసారిగా శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొని ప్రసంగించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌పై ఇటీవల చేసిన క్షిపణి దాడులను ఆయన సమర్ధించారు. ముస్లింల ఐక్యత కోసం పోరాడతామని ప్రకటించారు. ప్రతి ముస్లిం దేశానికి శత్రువు ఒక్కడే అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్ రాజధాని లాక్ డౌన్.. ముఖ్య నగరాల్లో ఇంటర్నెట్ బంద్.. కారణం ఇదే..