Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..

  • యుద్ధం ఎఫెక్ట్, ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం..
  • తల జుట్టు అమ్ముకుంటున్న ప్రజలు..
  • ల్యాప్‌ లాప్‌లు అద్దెకు ఇస్తూ అదనపు ఆదాయం..
Iran

Iran

Iran Crisis: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం, ఆరో నెలలోకి ప్రవేశించింది. మరోవైపు, యుద్ధం వల్ల ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. తమను తాము బతికించుకోవడానికి అదనపు డబ్బు సంపాదన కోసం తల జుట్టు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు, పాత వస్తువుల్ని అమ్ముతూ, వ్యక్తిగత వస్తువులను అద్దెకు ఇస్తున్నారు. చాలా మంది ప్రజలు విలువలేనివిగా భావించిన వస్తువుల్ని కూడా ఇప్పుడు ఆదాయ మార్గాలుగా మార్చుకుంటున్నారు. ల్యాప్ టాప్‌లను కొద్ది కాలాని అద్దెకు ఇస్తున్నారు.

ఆన్‌లైన్ క్లాసిఫైడ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాడిన బట్టలు, పనికి వాడే బూట్లు, వాడిన పెర్ఫ్యూమ్ సీసాలు మరియు సహజమైన జుట్టుకు సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలు హెయిర్ ఎక్స్‌టెన్షన్లలో ఉపయోగించడం కోసం సహజమైన తల జట్టును అమ్ముతున్నారు. పొడవు, రంగు, నాణ్యతను బట్టి ఈ జుట్టు ధర కొన్ని వేల ఇరాన్ రియాల్స్ పలుకున్నాయి. వాడిన పెర్ఫ్యూమ్ సీసాలకు కూడా కొనుగోలుదారులు దొరుకుతున్నారు.

ఇరాన్‌లో జూలైలో ద్రవ్యోల్బణం 66 శాతానికి చేరుకుంది. సంవత్సరవారీ ద్రవ్యోల్బణం 87.9 శాతంగా నమోదైంది. యుద్ధం కారణంగా ఆహార ధరలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. అయినప్పటికీ, దేశ పూర్తిస్థాయి ఆర్థిక పతనానికి మరింత కాలం ఉందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. రోజూవారీ ఖర్చులు పెరుగుతుండటంతో ఆరోగ్య సంరక్షణ, మందుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.