Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..

  • పాక్, టర్కీలతో ఒప్పందాలు మిమ్మల్ని రక్షించలేవు..
  • సౌదీ అరేబియాకు ఇరాన్ వార్నింగ్..
Saudi Pak Turkey

Saudi Pak Turkey

Iran: టర్కీ, పాకిస్తాన్‌లతో సౌదీ అరేబియా చేసుకున్న రక్షణ ఇప్పందంపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఒప్పందం సౌదీకి దీర్ఘకాలిక భద్రత కల్పించదని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు, జాతీయ భదత్ర-విదేశాంగ కమిటీ సభ్యుడు ఎబ్రహీం రెజాయి అన్నారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ‘‘టర్కీ, పాకిస్తాన్‌లతో కుదుర్చుకున్న ఈ కాగితపు ఒప్పందం సౌదీకి భద్రత ఇవ్వదు. గతంలో అమెరికాపై ఏకపక్షంగా ఆధారపడినా సౌదీకి భద్రత లభించలేదు’’ అని అన్నారు.

టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య శుక్రవారం కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ‘‘ఇస్లామిన్ నాటో’’గా అభివర్ణిస్తున్న సౌదీలోని పవిత్ర నగరం మక్కాలో జరిగింది. ‘‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’’పై ముగ్గురు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా, అది మిగిలిన రెండు దేశాలపై జరిగినట్లుగానే పరిగణిస్తారు. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాలు రక్షణ సహకారం, ఇంటెలిజెన్స్ షేరింగ్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాయి.