Iran-US War: రోడ్డెక్కిన ఇరానీయులు.. విద్యుత్ ప్లాంట్ల దగ్గర మానవహారాలు
- ట్రంప్ బెదిరింపుల వేళ రోడ్డెక్కిన ఇరానీయులు
- విద్యుత్ ప్లాంట్ల దగ్గర మానవహారాలు
- భారీగా తరలివచ్చిన చిన్నారులు, పెద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో లక్షలాది మంది ఇరానీయులు రోడ్డెక్కారు. విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అమెరికా సూచించిన నేపథ్యంలో ఇరానీయులంతా చేరుకుని మానవహారాలుగా ఏర్పడ్డారు. చిన్నారులు, పెద్దలు సమూహంగా ఏర్పడ్డారు. దాడులు చేయొద్దంటూ చిన్నారులు ప్లకార్డులు పట్టుకున్నారు.
ఇరాన్‌లోని వంతెనలు, రైల్వే నెట్‌వర్క్‌లు, విద్యుత్ ప్లాంట్లు వంటి పౌర మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. తబ్రిజ్-జంజాన్ హైవేపై ఉన్న ఒక వంతెనను పేల్చివేసింది. కాషాన్ నగరంలోని ఒక రైల్వే వంతెనపై జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. దీనికి నిరసనగా ఇరాన్ పౌరులు వీధుల్లోకి వచ్చారు. ఐక్యతను, దేశభక్తిని ప్రదర్శిస్తూ మానవ హారాలుగా ఏర్పడి నిరసన తెలుపుతున్నారు.
Also Read
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
ప్రస్తుతం ఇరాన్‌లోని పలు ప్రధాన వంతెనలు, రైల్వే నెట్‌వర్క్‌లపై అమెరికా దాడులు చేయడంతో ప్రజలు గుమిగూడారు. అలాగే ఇరాన్‌లోని పలు ప్రధాన విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని కూడా ట్రంప్ బెదిరించారు. దీంతో పౌరులంతా విద్యుత్ ప్లాంట్ల దగ్గరకు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఖిర్ ఘాలిబాఫ్ ఎక్స్‌లో… తాను ఇరాన్‌కు ‘‘అంకితమైనవాడినని’’ రాసుకొచ్చారు. 14.3 మిలియన్లకు పైగా ప్రజలు సైన్-అప్ అయినట్లు తెలిపారు. ఇది తమ దేశం పట్ల ఇరాన్ ప్రజల విధేయతను ప్రదర్శిస్తుంది. దేశాన్ని బెదిరించే లేదా లొంగిపోతున్నట్లు సంకేతం ఇచ్చే ఏ వేలునైనా తాను ‘‘నరికివేస్తానని’’ ఘాలిబాఫ్ హెచ్చరించారు.
تشکیل زنجیره انسانی مردم تبریز مقابل نیروگاه حراراتی این شهر pic.twitter.com/zlfULncFqV
— خبرگزاری ایسنا (@isna_farsi) April 7, 2026
14,376,758+1
محمدباقر قالیباف، یک #جانفدا برای ایران pic.twitter.com/aKMLawMAWS— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 7, 2026
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!