Masoud Pezeshkian: అమెరికాతో ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో రాజకీయ సంక్షోభం.. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాజీనామా..!
- అమెరికాతో ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో రాజకీయ సంక్షోభం
- అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాజీనామా..!
- మరోవైపు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఆ వార్తలను ఖండించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్గత అధికార పోరాటాల మధ్య ఇరాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తన పదవికి రాజీనామా లేఖ సమర్పించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించగా, మరోవైపు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఆ వార్తలను ఖండించింది. విదేశీ మీడియా నివేదికల ప్రకారం, అధ్యక్షుడు పెజెష్కియన్ సుప్రీం లీడర్ Mojtaba Khamenei కార్యాలయానికి రాజీనామా లేఖ పంపినట్లు సమాచారం. ఆ లేఖలో దేశంలోని కీలక నిర్ణయాల ప్రక్రియ నుంచి అధ్యక్ష పదవి, ఎన్నికైన ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నట్లు కథనాలు చెబుతున్నాయి.
ఐఆర్జీసీ ప్రభావంపై ఆరోపణలు
Also Read
లేఖలో, Islamic Revolutionary Guard Corps (IRGC) కు చెందిన కఠినవాద వర్గాలు ప్రభుత్వ వ్యవహారాలపై అధిక ప్రభావం చూపుతున్నాయని, దీంతో ఎన్నికైన ప్రభుత్వం తన రాజ్యాంగబద్ధ బాధ్యతలను సమర్థంగా నిర్వహించలేకపోతోందని పెజెష్కియన్ పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. గత కొన్ని నెలలుగా ఇరాన్లో ప్రభుత్వ వ్యవస్థ, భద్రతా వ్యవస్థల మధ్య అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికాతో జరుగుతున్న చర్చలు, ప్రాంతీయ భద్రతా అంశాలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
అధికారికంగా రాజీనామా ధృవీకరణ లేదు
అయితే, ఈ రాజీనామా వార్తలపై ఇరాన్ అధ్యక్ష కార్యాలయం స్పష్టమైన ఖండన జారీ చేసింది. అధ్యక్షుడు తన రాజ్యాంగబద్ధ బాధ్యతలను కొనసాగిస్తున్నారని, రాజీనామా వార్తలు వదంతులేనని అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో పెజెష్కియన్ నిజంగా రాజీనామా చేశారా? లేదా రాజకీయ ఒత్తిళ్ల మధ్య ప్రచారంలోకి వచ్చిన సమాచారం మాత్రమేనా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. సుప్రీం లీడర్ కార్యాలయం నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇరాన్ రాజకీయాల్లో కీలక పరిణామం
రాజీనామా వార్తలు నిజమైతే, అది ఇరాన్లో ఎన్నికైన ప్రభుత్వానికి, భద్రతా వ్యవస్థకు మధ్య ఉన్న విభేదాలను బహిర్గతం చేసే కీలక పరిణామంగా భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికాతో జరుగుతున్న దౌత్య చర్చలు, ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై అధికారిక ధృవీకరణ కోసం ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఇరాన్ వైపు మళ్లింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?