NTV Telugu Site icon

Ebrahim Raisi: ఇబ్రహీం రైసీ మరణానికి పేజర్లు పేలుళ్ల కారణం..

Iran

Iran

Ebrahim Raisi: లెబనాన్‌లో ఇటీవల వరుసగా చోటు చేసుకున్న పేజర్లు, వాకీటాకీలు పేలిపోయాయి. హెజ్‌బొల్లా సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ ఈ దాడికి పాల్పడినట్లు అనేక ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌ పార్లమెంటు సభ్యుడు అహ్మద్ బక్షాయేష్ అర్డెస్తానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మే నెలలో అప్పటి ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాద ఘటనను పేజర్ల పేలుళ్లతోనే జరిగిందన్నారు. రైసీ కూడా పేజర్‌ వినియోగించేవారని ఛాపర్ లోపల పేజర్లు పేలిపోయి అది క్రాష్‌కు దారితీసిందని ఇరాన్ ఎంపీ ఆరోపించారు.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

కాగా, పేజర్ల కొనుగోలులో ఇరాన్‌ పాత్ర ఉందని ఎంపీ అహ్మద్ బక్షాయేష్ అర్డెస్తానీ సూచించారు. ఇరానియన్ దళాలు ఖచ్చితంగా హిజ్బుల్లా యొక్క పేజర్ల కొనుగోలులో పాత్రను పోషించాయి.. అందువల్ల మన స్వంత గూఢచార సంస్థలు కూడా ఈ విషయాన్ని పరిశోధించాలి అని సూచించారు. అయితే, ఈ నెల ప్రారంభంలో ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసిన తుది దర్యాప్తు నివేదిక ప్రకారం.. దట్టమైన పొగమంచుతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్లే ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి కారణం అయిందని వెల్లడించారు. అలాగే, సెప్టెంబరు 16, 17న జరిగిన దాడుల్లో హిజ్బుల్లా సభ్యులు ఉపయోగించే పేజర్లు, వాకీ-టాకీలు పేలాయి. ఆ దాడుల్లో మొత్తం 39కి పైగా మృతుల సంఖ్య పెరిగింది. అలాగే, 3,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు ఇజ్రాయెల్ చేసిందని విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది.