Site icon NTV Telugu

Iran: ఇరాన్‌లో మిన్నంటిన మహిళల ఆందోళనలు.. హిజాబ్ తీసేసి నిరసనలు

Women Protest In Iran

Women Protest In Iran

Iranian women take off Hijab, protest Mahsa Amini’s death: ఇరాన్ దేశంలో మహిళల ఆందోళనలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి. రాజధాని టెహ్రాన్ లో భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు మహిళలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిజాబ్ తీసేసి మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. హిజాబ్ ధరించలేదని..మహ్స అమినీ అనే 22 ఏళ్ల అమ్మాయిని మోరాటిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఆ తరువాత కోమాలోకి వెళ్లి శుక్రవారం మరణించింది. దీనిపై దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. మోరాలిటీ పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మహ్సా అమినీ చనిపోయిందని మహిళలు ఆరోపిస్తున్నారు. ఆమె అంత్యక్రియలు పశ్చిమ ఇరాన్ లో జరుగుతన్న క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.

ఇరాన్ లో మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే చట్టం ఉంది. అయితే తాజాగా మహ్సా అమిని మరణం తరువాత పెద్ద సంఖ్యలో బయటకు వచ్చిన మహిళలు హిజాబ్ తీసేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియంతకు మరణం అంటూ నినాదాలు చేశారు. ఆందోళనలను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించాయి. టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలను ఉపయోగించి ఆందోళనలను అదుపులోకి తీసుకురావాడానికి భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

Read Also: Vijaya Sai Reddy: ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుంది..!!

సోషల్ మీడియాలో కూడా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్ మహిళకలు ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పురుషులు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. హక్కుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ నిరసనలు చెలరేగాయి. ఇరాన్ దేశంలో మహిళల డ్రెస్సింగ్ విషయంలో అక్కడి అధికారులు కఠినంగా వ్యవహరిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తప్పకుండా హిజాబ్ ధరించాలనే కఠిన చట్టాలు ఉన్నాయి. వీటిని వ్యతిరేకిస్తున్నారు అక్కడి మహిళలు. తాజాగా జరిగిన ఆందోనళల్లో గతంలో మరణించిన ఖుద్ ఫోర్స్ కమాండర్ ఖాసిం సులేమానీ బ్యానర్లను చింపేశారు. మహ్సా అమిని మరణంపై అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ విచారణకు ఆదేశించారు.

Exit mobile version