Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. శనివారం ఉదయం అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో సహా పలు ప్రాంతాలపై వైమానిక, క్షిపణి దాడులు చేశాయి. మరోవైపు, ఇరాన్ కూడా అమెరికా మిత్రదేశాలపై విరుచుకుపడుతోంది. మిడిల్ ఈస్ట్‌లో యూఎస్ సైనిక స్థావరాలు ఉన్న ఖతార్, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రైయిన్, ఇరాక్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. మధ్యప్రాచ్యంలోని 7 దేశాలపై ఇరాన్ విరుచుకుపడింది. అమెరికా నేవీ 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగిందని బహ్రెయిన్ తెలిపింది.
Read Also: Israel-Iraq War : యుద్ధ సెగ.. మూతబడ్డ గగనతలం.. ఎయిర్ ఇండియా విమానాల దారి మళ్లింపు.!
మిడిల్ ఈస్ట్‌లోని ప్రధాన నగరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దోహ రాజధాని ఖతార్‌లో పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. ఇరాన్ దాడిలో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఒకరు మరణించినట్లు సమాచారం. దుబాయ్, అబుదాబీ లో కూడా పేలుళ్లు సంభవించాయి. అబుదాబిలో ఒక వ్యక్తి మరణించినట్లు నివేదికలు వెలువడ్డాయి. బహ్రైయిన్ మనామాలో కూడా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. యూఏఈలోని అల్ దఫ్రా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడులు చేసింది.
