Site icon NTV Telugu

Srilanka Crisis: ఆర్ధిక సంక్షోభం తీవ్రతరం.. ఐపీఎల్ ప్రసారాలు బంద్

Ipl 2022

Ipl 2022

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. దీంతో ఐపీఎల్ ప్రసారాలు కూడా నిలిచిపోయాయి. ప్రసార హక్కుదారులకు చెల్లించేందుకు డబ్బుల్లేక అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే యుప్ టీవీ, ఎస్ఎల్ఆర్సీ, డయలాగ్ టీవీ, పియో టీవీ ఛానల్‌లు క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ప్రసారాలను నిలిపివేశాయి. దేశంలో ఎమర్జెన్సీ నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్‌ చేసే మూడ్‌లో లేరని.. అందుకే ఐపీఎల్‌ టెలికాస్ట్‌పై అంతగా ఫోకస్‌ పెట్టలేదని అక్కడి మీడియా వెల్లడించింది.

ఐపీఎల్‌లో శ్రీలంక ఆటగాళ్లు హసరంగ ఆర్సీబీ తరఫున, భానుక రాజపక్స పంజాబ్‌ కింగ్స్ తరఫున, దుష్మంత చమీర లక్నో సూపర్ జెయింట్స్ తరఫున, చమిక కరుణరత్నే కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నారు. ఐపీఎల్‌లో శ్రీలంక ఆటగాళ్లు ఆడుతుండటంతో వాళ్ల మ్యాచ్‌లను చూసే భాగ్యం శ్రీలంక ప్రజలకు లేకపోయింది. అసలే కష్టాలు పడుతున్న ప్రజలకు క్రికెట్ మ్యాచ్‌లు వినోదాన్ని అందిస్తాయని అందరూ భావించారు. కానీ ఆర్థిక సంక్షోభం అక్కడి వాళ్లు ఆనందాన్ని ఇవ్వలేకపోతోంది. ఇప్పటికే శ్రీలంకలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. పేపర్ కాస్ట్ పెరగడంతో పాటు సిబ్బంది జీతాలివ్వలేక పత్రికలు ప్రింటింగ్ చేయడం మానేశాయి. కనీసం డిజిటల్‌ పేపర్లలో కూడా ఐపీఎల్‌ వార్తల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

https://ntvtelugu.com/rajasthan-royals-gives-target-170-runs-infront-of-royal-challengers-bangalore/

Exit mobile version