China: లైవ్‌లో 7 బాటిళ్ల వోడ్కా తాగాడు.. చివరకు చచ్చిపోయాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: మద్యపానం అతిగా తాగితే హానికరం. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యపానంపై ఛాలెంజ్ చేసి మితిమీరిన మద్యం తాగిన వ్యక్తులు మరణించిన సంఘటనలు జరిగాయి. తాజాగా చైనాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇలాగే అతిగా తాగి మరణించాడు. లైవ్ స్ట్రీమింగ్ సమయంలో 7 బాటిళ్ల వోడ్కాను తాగాడు, చివరకు 12 గంటల్లోనే మరణించాడు. జైబియు అని పిలువడబే చైనీస్ వోడ్కాను తాగినట్లు సీఎన్ఎన్ నివేదించింది.
Read Also: Arikomban: మళ్లీ ప్రజలపై దాడులు మొదలుపెట్టిన పోకిరి ఏనుగు “అరికొంబన్”
Also Read
- Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
- Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
- Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
సాన్కియాంగ్ అనే 34 ఏళ్ల యువకుడు చైనా టిక్ టాక్ వెర్షన్ డౌయిన్ లో లైవ్ లో ఉంటూ 7 బాటిళ్ల చైనీస్ వోడ్కాను తాగాడు. దీంట్లో 30 నుంచి 60 శాతం దాకా ఆల్కాహాల్ కంటెంట్ ఉంటుంది. పీకే ఛాలెంజ్ లో పలు రకాల టాస్క్ లలో ఒకరిపై ఒకరు పోటీ పడుతుంటారు. ఇలాంటి సమయంలోనే సాన్కియాంగ్ వోడ్కాను తాగాడు. జావో అనే వీక్షకుడు మాట్లాడుతూ.. తాను చూసినప్పుడు మూడు బాటిళ్ల వోడ్కా తాగడమైపోయిందని, నాలుగోది తాగడం తాను చూశానని తెలిపాడు.
లైవ్ ప్రారంభం అయిన 12 గంటల తర్వాత అతను మరణించాడని చైనీస్ మీడియా వెల్లడించింది. అతని కుటుంబ సభ్యులు చూసే సమయానికే అతను ప్రాణం కోల్పోయినట్లు తెలిపింది. మితిమీరిన మద్యపానం వల్లే చనిపోయినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. సాధారణంగా డౌయిన్ మద్యపానాన్ని అనుమతించడు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మద్యం సేవించినందుకు గతంలో యాప్ నుంచి నిషేధించబడ్డాడు. అయితే.. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని మరోసారి మద్యంతాగి ప్రాణాలు కోల్పోయాడు.
తాజావార్తలు
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!