NTV Telugu Site icon

Indonesia Capital: ఇండోనేషియా రాజధాని మార్పు..?

Indonesia New Capital

Indonesia New Capital

INDONESIA CAPITAL CITY CHANGED: ఇండోనేషిమా రాజధాని ఏదంటే టక్కున చెప్పే ఆన్సర్ జకార్తా. అయితే మరికొద్ది నెలల్లోనే ఆ దేశ రాజధాని జకార్తా కాదు.. దానికి రెండు వేల కిలోమీటర్ల దూరంలోని బోర్నియో ద్వీపంలోని నుసంతర ప్రాంత్రం. ప్రస్తుతం కొత్త రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అసలు రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు.. ? ప్రభుత్వ ప్రణాళికలు ఏంటీ..? కొత్త నగరం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

Mice With Two Fathers: శాస్త్రవేత్తల అరుదైన రికార్డ్.. రెండు మగ ఎలుకల నుంచి సంతానం

ఇండోనేషియా అనేక దీవుల సమాహారం. ఎక్కువ భాగం అటవీ ప్రాంతం కావడం వల్ల నేలపై జనాభా ఒత్తిడి ఉంటుంది. జావా ద్వీపంలోని రాజధాని జకార్తా ఇప్పటికే ఒకటిన్నరకు పైగా జనాభాతో కిక్కిరిసిపోయింది. మరో పక్క సముద్రతీరంలోని జకార్తా ఏటా కిందకు కుంగుతోంది. ఏటా కొన్ని సెంటిమీటర్ల మేర నేల కుంగుతోంది. దీంతో జకార్తా ఎదుర్కొంటున్న భారీ పర్యావరణ సవాళ్ల నుంచి రిలీప్ పొందేందుకు ఇండోనేషియా ప్రభుత్వం రాజధాని నగరాన్ని మార్చుతుంది. బోర్నియో ద్వీపంలోని తూర్పున గల కాలిమాంటన్ అటవీ ప్రాంతంలో నుసంతర పేరిట కొత్త నగరాన్ని ఇండోనేషియా ప్రభుత్వం నిర్మిస్తోంది. అసలు ఇండోనేషియా రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు? ప్రభుత్వ ప్రణాళికలు ఏంటి? పర్యావరణ కార్యకర్తలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? కొత్త రాజధాని నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతుంది? బోర్నియో ద్వీపంలోని కొత్త రాజధాని నగరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? వంటి విషయాలను తెలుసుకుందాం.

Pavithra Naresh: ఔను.. వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు

ప్రస్తుత రాజధాని జకార్తాలో సుమారు కోటి మంది ప్రజలు నివసిస్తున్నారు. గ్రేటర్ మెట్రో పాలిటన్ ప్రాంతంలో 35 లక్షల మంది ఉన్నారు. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో జకార్తా నగరం వేగంగా మునిగిపోతోందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కొత్త రాజధాని నగరం అవసరమైంది. వేర్వేరు నివేదికల ప్రకారం 2050 నాటికి జకార్తాలోని మూడింట ఒక వంతు మునిగిపోయే అవకాశం ఉంది. వర్షాలు భారీగా కురిసినా సరైన నీటి సంరక్షణ విధానాలు లేకపోవడం వల్ల జకార్తా ప్రజలు భూగర్భ జలాలను బోర్ల ద్వారా తోడి వేస్తున్నారు. నగరంలో కిందకు దిగిపోయేందుకు ఇదే ప్రధాన కారణమని పర్యవరణవేత్తలు చెబుతున్నారు. అనియంత్రిత భూగర్భజలాల వెలికితీత వల్ల వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పర్యవరణవేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Show comments