Site icon NTV Telugu

Indigo : అంత తక్కువ ధరకే విమాన ప్రయాణమా..

Sam (8)

Sam (8)

ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బస్ టిక్కెట్ ధరలకే విదేశాలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. పండగలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్లను ప్రకటించినట్లు సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పండగ టైంలో అన్ని మార్గాలతో పాటు విమాన ప్రయాణం కూడా రద్దీగా ఉంటుంది. విమాన ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఇండిగో మాత్రం గోల్డెన్ ఆఫర్ ఇచ్చింది. తక్కువ ధరలో ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా మీరు సెలవులు, ఫ్యామితలీ ట్రిప్స్, బిజినెస టూర్స్ అన్ని మీ బడ్జెట్ లో పూర్తి చేసుకుంటారు.

భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వారం రోజుల పాటు ‘గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్’ సేల్‌ను ప్రకటించింది. కంపెనీ సేల్ సెప్టెంబర్ 15 నుండి 21 వరకు జరుగుతుంది. ఈ సేల్ 2026 ప్రారంభంలో కస్టమర్లు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కంపెనీ సేల్ సెప్టెంబర్ 15 నుండి 21 వరకు జరుగుతుంది. ఈ సేల్ 2026 ప్రారంభంలో కస్టమర్లు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లు జనవరి 7 నుండి మార్చి 31, 2026 వరకు ప్రయాణానికి చెల్లుతాయి. పండుగలు లేదా వ్యాపార పనుల కోసం ముందుగానే టూర్‌ ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి అవకాశం అంటున్నారు నిపుణులు.

విమాన టిక్కెట్ ధరలు రూ.1,299 నుండి ప్రారంభమవుతాయి: ‘ గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్ ‘ కింద వినియోగదారులు రూ.1,299 నుండి ప్రారంభమయ్యే వన్-వే దేశీయ ఛార్జీలను, రూ.4,599 నుండి ప్రారంభమయ్యే అంతర్జాతీయ ఛార్జీలను ఆస్వాదించవచ్చు. ఈ ఆఫర్ ఇండిగో వన్-వే బుకింగ్‌లకు మాత్రమే చెల్లుతుంది. రౌండ్-ట్రిప్ బుకింగ్‌లకు వర్తించదు. అలాగే, ఈ ఆఫర్ ఇండిగో నిర్వహించే నాన్-స్టాప్ విమానాలకు మాత్రమే చెల్లుతుందని విమానయాన అధికారులు చెబుతున్నారు. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో స్ట్రెచ్/బిజినెస్ క్లాస్‌కు అన్నీ కలిసిన (వన్-వే) ఛార్జీలు రూ. 9,999 నుండి ప్రారంభమవుతాయి.

Exit mobile version