Saudi Arabia: సౌదీ అరేబియాపై యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రమవుతున్నాయి. దమ్మామ్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో ఒక భారత పౌరుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత భారత అధికారులు సంబంధిత మృతుల కుటుంబాలను సంప్రదిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు, ఆత్మీయులకు భారత అధికారులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సౌదీ అధికారులు నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను భారత రాయబార కార్యాలయ అధికారులు సేకరిస్తున్నారు.
సౌదీ అధికారుల ప్రకారం.. బుధవారం సాయంత్రం దమ్మామ్ ఎయిర్ పోర్టుపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక సౌదీ పౌరుడు, ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) తెలిపింది. ఈ దాడిలో మొత్తం 8 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు భారతీయులు, ఇద్దరు యెమెన్ పౌరులు, ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులు, ఒక నేపాల్ వ్యక్తి ఉన్నారు.

