NTV Telugu Site icon

India will beat China: ఈ ఏడాది చైనాపై పైచేయి సాధించి నంబర్-1గా ఎదగనున్న ఇండియా

India Will Beat China

India Will Beat China

India will beat China: మన దేశం నుంచి బ్రిటన్‌కి వెళ్లే విద్యార్థుల సంఖ్య నాలుగైదేళ్ల కిందట దాదాపు 20 వేలు మాత్రమే ఉండేది. కానీ ఈ సంఖ్య గతేడాది ఏకంగా లక్ష వరకు చేరింది. ఈ సంవత్సరం మరింత పెరగనుందని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు చైనా నంబర్‌-1 ప్లేస్‌లో ఉండేది. ఈ ఏడాదితో ఇండియా చైనాపై పైచేయి సాధించటం ద్వారా అగ్రస్థానానికి ఎదగనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాల గురించి ఇండియాలోని బ్రిటిష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ తెలిపారు.

”ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న శుభ సందర్భంలో ఈ సంవత్సరం ఇండియన్‌ స్టూడెంట్స్‌కి బ్రిటన్‌ 75 చెవెనింగ్ స్కాలర్‌షిప్‌లను ఆఫర్‌ చేస్తోంది. గతంలో ఎప్పుడూ ఇన్ని ఇవ్వకపోవటం గమనార్హం. వచ్చే ఏడాది నుంచి మరింత మంది స్పాన్సర్లు చేరనున్నారు. దీంతో ఇంకా ఎక్కువ స్కాలర్‌షిప్‌లు ఇచ్చే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఇటీవలే అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. దీని ప్రకారం విద్యార్హతలకు పరస్పర గుర్తింపు లభించనుంది.

Russia will buy Rupees: మన కరెన్సీ రూపాయిని భారీగా కొననున్న రష్యా

ఈ అవగాహన ఒప్పందం పరిధిలో మారిటైం ఎడ్యుకేషన్‌, హెల్త్‌ కేర్‌ వర్కర్ల కోసం రూపొందించిన ఫ్రేమ్‌వర్క్‌ అగ్రిమెంట్‌ కూడా ఉన్నాయి. దీంతో యూకే మాస్టర్స్‌ డిగ్రీని ఇండియాలో గుర్తిస్తారు. బ్రిటన్‌ పౌరులు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు లేదా పీహెచ్‌డీలు చేసేందుకు ఇకపై ఎలాంటి ఆటంకాలూ ఎదురుకావు. రెండు దేశాల మధ్య విశ్వాసం, నమ్మకం పెరగటానికి ఇలాంటి చర్యలు ఎంతగానో దోహదపడతాయి.

ఇరు దేశాల మధ్య విద్యార్థుల, ప్రజల రాకపోకలు ఇప్పటికే ఓ స్థాయిలో సాగుతున్నాయి. ఇవి రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయి. ఇండియన్‌ మాస్టర్స్‌ డిగ్రీలను మేమూ గుర్తిస్తాం. భారతీయులు బ్రిటన్‌లో జాబ్స్‌ చేసేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. బ్రిటన్‌ జారీ చేసే ఆల్‌ స్కిల్డ్‌ వర్క్‌ వీసాల్లో 44% వరకు ఇండియన్‌లకే వస్తాయి. ఇండియా యూకే మార్కెట్‌తో మరింత మమేకమయ్యేందుకు స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం దోహదపడుతుంది.

రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపడతాయి. ఒప్పందంపై చర్చలు ఈ నెలాఖరుకి ముగుస్తాయి. దీంతో ఇరు దేశాలకు వ్యూహాత్మక ప్రయోజనాలు, టారిఫ్‌ల తగ్గింపు వంటి సువర్ణావకాశాలు అందుబాటులోకి వస్తాయి” అని ఇండియాలో బ్రిటిషన్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ పేర్కొన్నారు.