Site icon NTV Telugu

UN: ఐక్యరాజ్యసమితిలో పాక్‌ తీరును ఎండగట్టిన భారత్

Indiapak

Indiapak

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ తీరును భారత్ ఎండగట్టింది. ఉగ్రవాద దాడుల్లో 20,000 మంది భారతీయులు మరణించారని భారత్ తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు గుప్పించింది. గత నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అయితే సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్ తప్పుడు సమాచారం ఇచ్చిందని భారత్ విమర్శించింది. గత నెలలో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాతే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు పేర్కొంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత రాయబారి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Rajanna Siricilla: బైకులోకి దూరిన పాము.. పార్ట్స్ అన్నీ ఊడదీసినా.. చివరకు

ఐక్యరాజ్యసమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్‌ రాయబారిపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదులకు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్థాన్‌కు ప్రజల ప్రాణాలను రక్షించడం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పాక్‌‌ ప్రతినిధి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. భారత్‌ దశాబ్దాలుగా పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాదులతో పోరాడుతోందని తెలిపారు. సింధు జలాలపై పాకిస్థాన్ తప్పుడు సమాచారం ఇచ్చిందని.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాతే సింధు జలాలు నిలిపివేసినట్లు పర్వతనేని హరీష్ అన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఉపసంహరించుకునేంత వరకు 65 ఏళ్ల నాటి సింధు జలాల ఒప్పందం నిలిచి ఉంటుందని భారత్ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Priyadarshi : OTT లోకి వచ్చేసిన ‘సారంగపాణి జాతకం’

1960లో భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాలపై ఒప్పందం జరిగింది. అయితే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత.. ఏప్రిల్ 23న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారని.. ఇది భయంకరమైన ఉగ్రదాడిగా పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్థానే పెంచి పోషిస్తోందని భారత్ స్పష్టం చేసింది. గత నాలుగు దశాబ్దాల్లో ఉగ్రవాద దాడుల్లో 20,000 మందికి పైగా భారతీయులు మరణించారని హరీష్ అన్నారు .

Exit mobile version